గత కొన్ని రోజుల నుంచి యువ ఓపెనర్ శుభమన్ గిల్ పేరు వార్తల్లో మారు మోగిపోతుంది అన్న విషయం తెలిసిందే. ఇందుకు కారణం దారుణమైన ప్రదర్శన చేస్తూ భారీ స్కోర్లు నమోదు చేస్తూ ఉండడమే అని చెప్పాలి. ఇటీవల న్యూజిలాండ్తో జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో సెంచరీ తో చెలరేగిన శుభమన్ గిల్  ఆ తర్వాత అదే సెంచరీని డబల్ సెంచరీగా మలిచి ఎన్నో ప్రపంచ రికార్డులను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు అని చెప్పాలి. అయితే ఇక ఆ తర్వాత మూడో వన్డే మ్యాచ్ లోనే మరో అద్భుతమైన సెంచరీ చేసి అదరగొట్టాడు. ఇక మధ్యలో జరిగిన రెండో వన్డే మ్యాచ్లో 40 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచి కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు అని చెప్పాలి.


 మొత్తంగా మూడు వన్డే మ్యాచ్లలో కలిపి ఏకంగా 360 పరుగులు చేసి మూడు వన్డేల సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్ గా కూడా ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు.  ఇలా శుభమన్ గిల్ వీరోచితమైన ఇన్నింగ్స్ ల గురించి ఎంతోమంది మాజీ ఆటగాళ్లు స్పందిస్తూ ప్రశంసలు కురిపిస్తున్నారని చెప్పాలి. ఇక ఇటీవలే ఇదే విషయంపై స్పందించిన పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ సైతం ఏకంగా పొగడ్తలతో శుభమన్ గిల్ ను ఆకాశానికి ఎత్తేశాడు అని చెప్పాలి. శుభమన్ గిల్ ఇదే ఫామ్ లో కొనసాగితే ప్రపంచ క్రికెట్ను శాసించడం ఖాయం అంటూ సల్మాన్ బట్ అభిప్రాయపడ్డాడు.


 గిల్ భవిష్యత్తు సూపర్ స్టార్.. న్యూజిలాండ్తో మొదటి వన్డే మ్యాచ్లో డబుల్ సెంచరీ బాది.. ఇక మూడో వన్డే మ్యాచ్లో సెంచరీ సాధించాడు. కేవలం ఒక్క భారీ స్కోర్ తో అతడు సంతృప్తి చెందడం లేదు. అతను ప్రస్తుతం పరుగుల దాహంతో ఉన్నాడు అనడానికి ఇక ఇదే నిదర్శనం అంటూ సల్మాన్ బట్ చెప్పుకొచ్చాడు. 23 ఏళ్ల వయసులోనే శుభమన్ గిల్ చేసిన బ్యాటింగ్ అద్భుతం.. ఒకప్పుడు 30, 40 పరుగులు చేసి వికెట్ కోల్పోయేవాడు అని భావించే వాళ్ళం. కానీ ఇప్పుడు అందరి అభిప్రాయాన్ని మార్చేశాడు. ఇక ప్రపంచ క్రికెట్ను శాసించేది అతడే అనడంలో అతిశయోక్తి లేదు అంటూ ప్రశంసలు కురిపించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: