
ఇక ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాతో జరగబోయే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం అటు సర్పరాజ్ ఖాన్ కు టీమిండియాలో చోటు దక్కుతుందని అందరూ భావించారు. కానీ బీసీసిఐ అతనిని జట్టు ఎంపికలో పరిగణలోకి తీసుకోలేదు అని చెప్పాలి. అయితే బీసీసీఐలో చోటు సంపాదించుకోవాలంటే ఇంకేం చేయాలి అంటూ ఎంతో మంది క్రికెట్ ఫ్యాన్స్ సైతం విమర్శలు చేశారు. ఇక మాజీ ఆటగాళ్లు సైతం సెలెక్టర్ల తీరుపై తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు అని చెప్పాలి.
అయితే గత కొంతకాలం నుంచి ఎన్ని విమర్శలు వచ్చినా సర్పరాజ్ ఖాన్ విషయంలో మౌనంగానే ఉన్న బీసీసీఐ.. ఇటీవల మౌనం వీడింది. అతని టెస్టుల్లోకి ఎంపిక చేయకపోవడానికి గల కారణాన్ని బీసీసీఐ సెలెక్టర్ శ్రీధరన్ శరత్ చెప్పుకొచ్చాడు. అతడు తమ దృష్టిలో ఉన్నాడని తెలిపాడు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని ఇక జట్టు ఎంపిక చేస్తాము అంటూ చెప్పుకొచ్చాడు. ఇక సమయం వచ్చినప్పుడు అతనికి కూడా టీమిండియాలో ఛాన్స్ ఇస్తామంటూ తెలిపాడు సెలెక్టర్ శ్రీధరన్ శరత్. కాగా ఇప్పటికే ఆస్ట్రేలియాతో జరిగే రెండు టెస్టులకు జట్టు ఎంపీగా జరగగా.. ఇక మరో రెండు టెస్టుల జట్టు ఎంపికలో సర్పరాజ్ ఖాన్ పేరు ఉండే ఛాన్స్ ఉంది అని అందరూ అనుకుంటున్నారు.