2023 ఏడాదిలో భారత్ వేదికగా  వన్డే వరల్డ్ కప్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ వరల్డ్ కప్ లో భాగంగా భారత్ జట్టు ఇక టైటిల్ ఫేవరెట్ గా బలిలోకి దిగిబోతుంది. అయితే గత కొన్ని ల నుంచి టీమ్ ఇండియాకు వరల్డ్ కప్ అనేది అందని ద్రాక్ష లాగే కొనసాగుతూ వస్తుంది అన్న విషయం తెలిసిందే. ప్రతి వరల్డ్ కప్ లో కూడా భారీ అంచనాల మధ్య బరిలోకి దిగడం.. ఆ తర్వాత ఆకట్టుకునే ప్రదర్శన చేయలేక నిరాశపరచడం టీమిండియా వంతు అవుతుంది. అయితే ఈసారి మాత్రం టీమిండియా తప్పనిసరిగా వరల్డ్ కప్ విజేతగా నిలుస్తుంది అని అందరూ భావిస్తూ ఉన్నారు అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే ఇక ఏడాది భారత్ వేదికగా జరగబోయే వరల్డ్ కప్ లో భాగంగా ఎవరు తుది జట్టులో ఉంటే బాగుంటుంది అనే విషయంపై ఇప్పటినుంచే ఎంతోమంది మాజీ ఆటగాళ్లు ఇక తమ రివ్యూలను సోషల్ మీడియా వేదికగా వెల్లడించడం లాంటివి చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఇటీవల టీమిండియా మాజీ సెలెక్టర్ సునీల్ జోషి ఇదే విషయంపై మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన ప్రపంచ కప్ జట్టులో చాహల్ కు చోటు ఇవ్వలేను అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. 15 మంది సభ్యులతో కూడిన జట్టు గురించి మాట్లాడితే ఇక నా జట్టులో తప్పకుండా జడేజా ఉంటాడు. ఒకవేళ జడేజా ఫిట్గా లేకపోతే అక్షర్ పటేల్ జట్టులోకి వస్తాడు.


 అయితే లెగ్ బ్రేకర్ కావాలనుకుంటే రవి బిష్ణయ్ జట్టులో ఉండాలి. ఎందుకంటే రవి నిలకడైన ప్రదర్శన చేయగలడు. అంతేకాకుండా రవి బిష్ణయ్ చాహల్ కంటే మెరుగైన ఫీలింగ్ చేయగలడు. అందుకే చాహాల్ ను తన జట్టులోకి తీసుకోను అంటూ సునీల్ జోషి చెప్పుకొచ్చాడు. ఇటీవల కాలంలో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ నిలకడగా రాణిస్తూ మంచి ఫామ్ లో ఉన్నాడని.. అయితే మరింత నిలకడగా రాణించాల్సిన అవసరం ఉందని భిన్నమైన తరహా మైదానాలు ప్రపంచకప్ లో ఉంటాయి అంటూ చెప్పుకోచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: