టీమిండియా జట్టులో ఎంతమంది బ్యాట్స్మెన్లు ఉన్నప్పటికీ అటు చటేశ్వర్ పూజారా కు మాత్రం టెస్టు స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ గా ప్రత్యేకమైన గుర్తింపు ఉంది అన్న విషయం తెలిసిందే. అయితే ఎప్పుడూ కూడా దూకుడు అయిన ఆటగాళ్ల గురించే వార్తలు వస్తూ ఉంటాయి. కానీ నెమ్మదిగా ఆడుతూ జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునే టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ చటేశ్వర్ పూజారా గురించిన  వార్తలు మాత్రం అటు చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటాయి అని చెప్పాలి.


 అయితే ఇప్పటికే టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ అని ట్యాగ్ రావడం ద్వారా ఇక మిగతా ఫార్మాట్లకు పూర్తిగా దూరమైపోయాడు పూజార. ఇక ఎప్పుడు ఆడిన కూడా కేవలం టీమ్ ఇండియా టెస్ట్ జట్టు తరఫున మాత్రమే ఆడుతూ వస్తూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే నెమ్మదయిన ఆట తీరుకు అతను కేరాఫ్ అడ్రస్ టెస్ట్ క్రికెట్ లో బ్యాట్స్మెన్లు ఎలా ఆడాలి అనే విషయం ప్రస్తావనకు వస్తే ఇక అతని ఆటను ఒక నిదర్శనంగా చూపించవచ్చు అని చెప్పాలి. అయితే తన ఆటతీరుతో ఏకంగా టీమిండియా నయా వాల్ అనే ఒక బిరుదును కూడా సంపాదించుకున్నాడు. ఇక గత కొంతకాలం క్రితం ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడిన పూజార.. ఇక మళ్ళీ మునుపటి ఫామ్ను అందుకొని జట్టులో చోటు సంపాదించుకున్నాడు.


 కాగా టీమిండియా నయావాల్ పూజారాను క్రికెట్ దికజం సచిన్ టెండూల్కర్ పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేసాడు. భారత జట్టుకు అతడు అద్భుతమైన సేవలు అందించినప్పటికీ అతనికి సరైన గుర్తింపు రాలేదు అంటూ చెప్పుకొచ్చాడు. 99వ టెస్ట్ ఆడుతున్న పూజార.. టెస్టుల్లో ఏడు వేలకు పైగా రన్స్ చేశాడు అన్న విషయాన్ని గుర్తు చేశాడు సచిన్ టెండూల్కర్. ఇప్పుడు వరకు టెస్ట్ ఫార్మాట్లో టీమ్ ఇండియా సాధించిన అరుదైన విజయాలలో చటేశ్వర్ పూజార పాత్ర ఎంతో కీలకమైనది అంటూ తెలిపాడు.  కాగా జట్టులోకి పునరాగమనం చేసిన తర్వాత పూజార తనదైన ఆట తీరుతో ఆకట్టుకుంటున్నాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: