ప్రపంచ క్రికెట్లో ఉన్న అత్యుత్తమ ఫీల్డర్ల గురించి ప్రస్తావిస్తే ఇక అందరికంటే ముందు వరసలో అగ్రస్థానంలో నిలిచేది టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అని చెప్పాలి. మైదానంలో రెడ్ బుల్ తాగినట్లుగా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండే విరాట్ కోహ్లీ మెరుపు వేగంతో కదులుతూ అద్భుతమైన క్యాచ్ లను అందుకుంటు ఉంటాడు. అంతేకాదు ఇక పరుగులను కట్టడి చేయడానికి విరాట్ కోహ్లీ చేసే రిస్కీ విన్యాసాలు అయితే అందరిని అబ్బురపరుస్తూ ఉంటాయి అని చెప్పాలి. ఇక విరాట్ కోహ్లీ ఫీలింగ్ చేస్తున్న వైపు బంతి గాలిలోకి లేచింది అంటే బ్యాట్స్మెన్ తన వికెట్ పోయింది అని ఫిక్స్ అయిపోతూ ఉంటాడు అని చెప్పాలి. అంతలా తన ఫీల్డింగ్ తో ప్రపంచక్రికెట్లో తనకంటూ ప్రత్యేకమైన మార్కు క్రియేట్ చేసుకున్నాడు.


 విరాట్ కోహ్లీ అటు మిస్ ఫీల్డ్ చేయడం మాత్రం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఇక ఇలా మిస్ ఫీల్డ్ జరిగినప్పుడు కూడా ఇక అతని నైపుణ్యం గురించి తెలిసి ఎవరు అతని ఒక మాట అనరు అని చెప్పాలి. అయితే ఇక ఇటీవలే మొదటి టెస్ట్ మ్యాచ్ లో భాగంగా అటు ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కోహ్లీ మిస్ ఫీల్డ్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 16 ఓవర్ లో ఇది జరిగింది. అక్షర్ పటేల్ వేసిన ఆ ఓవర్లో తొలి బంతిని స్మిత్ అవుట్ సైడ్ ఎడ్జ్ దిశగా ఆడాడు. అయితే ఫస్ట్ స్లిప్ లో ఉన్న విరాట్ కోహ్లీ ఏమరుపాటులో  ఇక దూసుకు వస్తున్న బంతిని చూసుకోలేదు.


 అయితే అప్పటికే బంతి అతను చేతి నుంచి కాస్త దూరంగా వెళుతుంది. అయితే బంతిని పట్టుకునే ప్రయత్నంలో కోహ్లీ పూర్తిగా విఫలం అయ్యాడు అని చెప్పాలి.  దీంతో ఇక బౌలర్ అక్షర్ పటేల్, కెప్టెన్ రోహిత్ శర్మలు కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు. విరాట్ కోహ్లీని చూస్తూ ఉండిపోయారు అని చెప్పాలి.ఇక ఆ సమయంలో స్మిత్ ఆరు పరుగులతో క్రీజులో ఉన్నాడు. ఇక ఆ తర్వాత మరో క్యాచ్ ని కూడా కోహ్లీ ఇదే తరహాలో జార విడిచాడు. అయితే కోహ్లీ మిస్ ఫీల్డ్ పై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మార్క్  వా చురకలు అంటించాడు. తొలి టెస్ట్ కు అతను కామెంటెటర్  గా ఉన్నాడు. ఈ క్రమంలోనే మేటి ఫీల్డర్ అని పేరున్న కోహ్లీ ఇలా రెండు క్యాచ్లు నేలపాలు చేయడం ఆశ్చర్యపరిచింది. కోహ్లీ గేమ్ లో ఉన్నప్పటికీ బాడీ ప్రెసెంట్ మైండ్ ఆబ్సెంట్ అన్న తరహాలో ఉన్నాడు అంటూ విమర్శలు చేశాడు.  ఇక అతని విమర్శలపై స్పందించిన కోహ్లీ ఫ్యాన్స్ అందరూ మీలాగా చురుకుగా ఉండరు కదా అంటూ కౌంటర్లు వేస్తూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: