ప్రస్తుతం టీమిండియా జట్టులో స్టార్ ఆల్ రౌండర్ గా కొనసాగుతూ ఉన్నాడు హార్దిక్ పాండ్యా.  గతంలో గాయాలు బెడద కారణంగా ఇక ఫామ్ కోల్పోయి టీమిండియా కు దూరమైన హార్దిక్ పాండ్యా.. ఆ తర్వాత మునుపటి ఫామ్ను అందుకొని జట్టులోకి దూసుకు వచ్చాడు అని చెప్పాలి. ఇక ఆ తర్వాత తనకు తిరుగులేదు అని నిరూపించాడు హార్థిక్ పాండ్యా. ప్రస్తుతం ఇక జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగడమే కాదు అటు రెగ్యులర్ కెప్టెన్ అయిన రోహిత్ శర్మ అందుబాటులో లేని సమయంలో  పాండ్యా సారధ్య బాధ్యతలు చేపట్టి ఇక తాత్కాలిక కెప్టెన్ గా కూడా వ్యవహరిస్తున్నాడు అని చెప్పాలీ.


 ఇకపోతే హార్థిక్ పాండ్యాకు సోషల్ మీడియాలో ఉండే క్రేజ్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు అని చెప్పాలి. అయితే ఎప్పుడు క్రికెట్ కి సంబంధించిన విషయాలు మాత్రమే కాకుండా తన పర్సనల్ లైఫ్ కి సంబంధించిన ఎన్నో విషయాలను కూడా హార్దిక్ పాండ్యా సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ ఉంటాడు అని చెప్పాలి. అయితే హార్దిక్ పాండ్యాకు ఇప్పటికే పెళ్లయిపోయింది అన్న విషయం దాదాపు అందరికీ తెలుసు. హార్దిక్ పాండ్యా ఎన్నో రోజులపాటు డేటింగ్ లో కొనసాగుతూ ప్రాణంగా ప్రేమించిన ప్రియురాలు నటాషాను పెళ్లి చేసుకున్నాడు. ఇక ఈ జంటకి ఒక బాబు కూడా ఉన్నాడు అని చెప్పాలి.



 అయితే ఇక ఇప్పుడు టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా మరోసారి పెళ్లి చేసుకోబోతున్నాడు అనేది తెలుస్తుంది   అదేంటి హార్దిక్ పాండ్యా లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు కదా.. ఇక ఇప్పుడు సెకండ్ మ్యారేజ్ ఎందుకు చేసుకుంటున్నాడు అని అనుకుంటున్నారు కదా. అయితే ఇక ఇప్పుడు రెండోసారి పెళ్లి చేసుకోవాలనుకుంటుంది కూడా మొదటి భార్య నటాషానే కావడం గమానార్హం. ప్రేమికుల రోజు అయినా ఫిబ్రవరి 14వ తేదీన నటాషాను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతున్నాడు హార్థిక్ పాండ్యా. రాజస్థాన్లోని ఉదయపూర్ లో ఇక నేటి నుంచి 16వ తేదీ వరకు హల్దీ, మెహందీ, సంగీత్ వేడుకలు జరుగుతాయట. కరోనా టైంలో కొంతమంది బంధుమిత్రుల మధ్య పెళ్లి చేసుకుంది ఈ జంట ఇ. ప్పుడు అందరి సమక్షంలో ఘనంగా పెళ్లి చేసుకుంటారట.

మరింత సమాచారం తెలుసుకోండి: