ప్రస్తుతం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆడేందుకు అటు భారత పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా జట్టు ఇక ఇక్కడ నాలుగు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో హోరాహోరీగా తలబడుతుంది అన్న విషయం తెలిసిందే. సాధారణంగానే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా భారత్ మధ్య పోటీ అంటే ఎప్పుడు ఉత్కంఠ భరితంగానే ఉంటుంది. ఇక ఇప్పుడు ఏకంగా సొంత గడ్డ పైన భారత్ ఆడుతూ ఉండడంతో ఇక ఈ సిరీస్ మరింత హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.


 అయితే ఇక ఆస్ట్రేలియా, భారత్ మధ్య బోర్డర్ గావాస్కర్ ట్రోఫీ ప్రారంభంకి కొన్ని రోజుల ముందు నుండే భారత జట్టులో సీనియర్స్ స్పిన్నర్ గా కొనసాగుతున్న రవిచంద్రన్ అశ్విన్ పేరు ఇక బాగా హార్ట్ టాపిక్ గా మారిపోతుంది అని చెప్పాలి. అతనికి ఆస్ట్రేలియా జట్టు పై మంచి రికార్డులు ఉన్న నేపథ్యంలో అశ్విన్ తన స్పిన్ బౌలింగ్ తో అటు ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్లకు ముచ్చెమటలు  పట్టించడం ఖాయమని ఎంతోమంది మాజీలు అభిప్రాయం వ్యక్తం చేశారు. అనుకున్నట్లుగానే అశ్విన్ తన అద్భుతమైన స్పిన్ బౌలింగ్ తో మ్యాజిక్ చేసి చూపించాడు అని చెప్పాలి.


 మరి ముఖ్యంగా ఆస్ట్రేలియా జట్టులో స్టార్ ఓపెనర్ గా కొనసాగుతున్న పరుగుల వీరుడు డేవిడ్ వార్నర్ కు రవిచంద్రన్ అశ్విన్ కంటిమీద కొనుక్కు లేకుండా చేస్తున్నాడు. ఇప్పటివరకు టెస్ట్ ఫార్మాట్లో వార్నర్ ను ఏకంగా 11 సార్లు అవుట్ చేశాడు రవిచంద్రన్ అశ్విన్. ఇక ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ను సైతం రవిచంద్రన్ అశ్విన్ 11 సార్లు పెబిలియన్ పంపించాడు అని చెప్పాలి. కాగా ఈ లిస్టులో ఒకే బ్యాట్స్మెన్ 12సార్లు అవుట్ చేసి అశ్విన్ కంటే ముందు ఉన్నాడు కపిల్ దేవ్. మొత్తంగా డేవిడ్ వార్నర్ ను స్టువర్టు బ్రాడ్ 14 సార్లు అవుట్ చేసి టాప్ లో ఉన్నాడు అని చెప్పాలి. అయితే మిగతా టెస్ట్ మ్యాచ్ లలో అశ్విన్ ఇక ఇద్దర్నీ కూడా వెనక్కి నెట్టి టాప్ లోకి దూసుకొచ్చే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: