రవీంద్ర జడేజా టీమిండియా జట్టుకు ఎంతో కీలకమైన ఆటగాడు అన్న విషయాన్ని ఇక ఇటీవల రీ ఎంట్రీ మ్యాచ్లోనే మరోసారి నిరూపించాడు అని చెప్పాలి. మోకాలి గాయం కారణంగా శస్త్ర చికిత్స చేసుకున్నా రవీంద్ర జడేజా దాదాపు 5 నెలల పాటు జట్టుకు దూరంగానే ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ ఐదు నెలల కాలంలో ఆసియా కప్ టి20 వరల్డ్ కప్ లాంటి కీలకమైన టోర్నీలు ఆడలేదు. అయితే ఇక ఇటీవల ఆస్ట్రేలియాతో నాలుగు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో రవీంద్ర జడేజా మళ్ళీ టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు అన్న విషయం తెలిసిందే. అయితే మొదటి మ్యాచ్ లోనే తన ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు.


 ఇటీవలే నాగపూర్ వేదికగా జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు రెండో ఇన్నింగ్స్ లో రెండు వికెట్లు తీసి తన స్పిన్ తో మ్యాజిక్ చేసిన జడేజా.. ఇక బ్యాటింగ్లో 70 పరుగులు చేశాడు. ఇకపోతే అభిమానులు అందరూ కూడా రవీంద్ర జడేజాని సర్ జడేజా అని పిలవడం చూస్తూ ఉంటాం. అయితే ఇక ఇలా అభిమానులు పిలవడం గురించి ఆగ్రహం వ్యక్తం చేశాడు రవీంద్ర జడేజా. అభిమానులు సర్ అని నన్ను పిలవడం ఇష్టం లేదు అంటూ చెప్పుకుచ్చాడు. అలా పిలిస్తే సర్ అనే పదాన్ని నేను అసహ్యించుకోవాల్సి వస్తుంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. అయితే గతంలో కూడా తనను సర్ అని పిలవద్దంటూ అభిమానులకు పలుమార్లు హెచ్చరించాడు.


 అయితే క్రికెటర్లు ఎంత చెప్పినా అభిమానులు ఊరుకోరు కదా తమకు నచ్చిన పదాలతోనే తమ అభిమాన క్రికెటర్లను పిలవడం లాంటివి చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇటీవలే నాగపూర్ వేదికగా జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ సమయంలో కూడా కొంతమంది అభిమానులు మరోసారి జడేజాను సర్ అని సంబోధించారు. ఈ క్రమంలోనే ఇటీవల ఇండియన్ ఎక్స్ ప్రెస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జడేజా ఈ విషయంపై మాట్లాడాడు. ఒకవేళ మీకు సర్ అని పిలవాలనిపిస్తే అలా కాకుండా బాపు అని పిలుచుకోవచ్చు. అంతేకానీ సర్ వర్ అని అడ్డమైన పదాలతో పిలవకండి అంటూ కామెంట్స్ చేశాడు రవీంద్ర జడేజా.

మరింత సమాచారం తెలుసుకోండి: