ప్రస్తుతం భారత జట్టుకు మూడు ఫార్మాట్లకు కూడా కెప్టెన్ గా కొనసాగుతున్న రోహిత్ శర్మ జట్టును ఎంతో విజయవంతంగా ముందుకు నడిపిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ఇక తనదైన వ్యూహాలతో మాజీ ఆటగాళ్ళను కూడా ఆశ్చర్యపరుస్తూ ఉన్నాడు. ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో ఎంతోమంది మాజీ ఆటగాళ్ళు రోహిత్ శర్మ కెప్టెన్సీ వ్యూహాలపై  ప్రశంసలు కురిపిస్తున్నారు అని చెప్పాలి. ఇకపోతే రోహిత్ శర్మ ఒక మంచి కెప్టెన్ మాత్రమే కాదు ఒక మంచి మనసున్న గొప్ప వ్యక్తి అంటూ మాజీ ప్లేయర్ హార్భజన్ సింగ్ సైతం ఇటీవల ప్రశంసలు కురిపించాడు. తొలిసారి భారత జట్టులోకి రోహిత్ శర్మ వచ్చినప్పుడు అతని కలుసుకున్నప్పుడు జరిగిన విషయాలను గుర్తు చేసుకున్నాడు హర్భజన్ సింగ్.


 2007 టీ20 వరల్డ్ కప్ లో రోహిత్ శర్మను కలుసుకున్నాను అంటూ హర్భజన్ సింగ్ చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే తొలిసారి కలిసినప్పుడు రోహిత్ శర్మ పై కలిగిన అభిప్రాయాన్ని ఇటీవల అభిమానులతో పంచుకున్నాడు. మైదానం వెలుపల రోహిత్ శర్మ ఒక మంచి వ్యక్తి అంటూ హర్భజన్ చెప్పుకొచ్చాడు. రోహిత్ శర్మ నాకు చాలా కాలంగా తెలుసు. అతను దక్షిణాఫ్రికాలో జరిగిన టి20 ప్రపంచ కప్ లో మొదటిసారి జట్టులో చేరాడు. ఇక బస్సులో నా సీటు వెనకే కూర్చునేవాడు. రోహిత్ అప్పట్లో ముంబై స్టైల్ లో మాట్లాడటం నాకు ఇప్పటికీ కూడా గుర్తు ఉంది.


 అతని ఆట తీరు చూసిన తర్వాత తప్పకుండా ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా మారతాడని అనుకున్నాను. ఇక ఇప్పుడు అతను ఒక బ్యాట్స్మెన్ గా భారత జట్టు కెప్టెన్ గా ఎలా సక్సెస్ అవుతూ ఉన్నాడో మనం చూస్తూనే ఉన్నాం. అయితే రోహిత్ శర్మ మంచి బ్యాట్స్మెన్ మాత్రమే కాదు గొప్ప వ్యక్తిత్వం ఉన్న ఆటగాడు అంటూ హర్భజన్ సింగ్ ప్రశంసలతో ఆకాశానికి ఎత్తేశాడు. ఐపీఎల్ చరిత్రలో రోహిత్ శర్మ అత్యంత విజయవంతమైన కెప్టెన్. ధోని రోహిత్ శర్మలను మించిన కెప్టెన్ ఐపిఎల్ లో ఇంకెవరూ లేరు అంటూ తెలిపాడు. అంతేకాకుండా రోహిత్ శర్మ జట్టును నడిపించే తీరు ఎంతో అద్భుతంగా ఉంటుంది అంటూ వ్యాఖ్యానించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: