బిసిసిఐ ప్రతి ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక సాదాసీదా దేశీయ లీగ్ గా ప్రారంభమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఇక ఇప్పుడు ప్రపంచ క్రికెట్లో రిచెస్ట్ లీగ్ గా కొనసాగుతూ ఉంది అని చెప్పాలి. అంతేకాదు ఇక ప్రపంచ క్రికెట్లో టి20 ఫార్మాట్ కు ఇంతలా గుర్తింపు వచ్చింది అంటే అందుకు బీసీసీఐ నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ కూడా ఒక కారణం అని చెప్పాలి.


 ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఎంతోమంది యువ ఆటగాళ్లకు ఫైనాన్షియల్ గా భరోసా ఇవ్వడమే కాకుండా కెరియర్ కు కావాల్సిన అనుభవాన్ని కూడా ఇస్తూ ఉంటుంది. దేశ విదేశాల నుంచి వస్తున్న స్టార్ ప్లేయర్లు అందరూ కూడా ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగం అవుతూ ఉంటారు. కాబట్టి ఇక ఒక్కసారి ఈ లీగ్ లో భాగం అయితే చాలు ఊహించని రీతిలో అనుభవం సాధించేందుకు అవకాశం ఉంటుంది. ఇక ఇటీవల కాలంలో అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో బాగా రాణించిన ఆటగాళ్లే భారత జట్టులో కూడా చోటు దక్కించుకొని బాగా రాణిస్తూ ఉన్నారు. కాగా 2023 ఇండియన్ ప్రీమియర్ లీగ్ అటు మార్చ్ 31వ తేదీ నుంచి ప్రారంభం కాబోతుంది అన్న విషయం తెలిసిందే.


 ఇకపోతే ఐపీఎల్ గురించి భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 2008లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభానికి ముందు ఈ టోర్నీ గురించి ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నప్పుడు సునీల్ గవాస్కర్,  రవి శాస్త్రి మాకు ఈ టోర్నీ గురించి తొలిసారి చెప్పారు. ఐపీఎల్ సూపర్ సక్సెస్ అవుతుందని వాళ్ళు అప్పుడే చెప్పారు  అయితే ఈ లీగ్ ఆటగాళ్లకు కోట్ల రూపాయల ఆదాయం తెచ్చిపెట్టడంతో పాటు అటు ఎక్కువ మంది ఆడెందుకు కూడా అవకాశం కల్పిస్తుంది అంటూ వీరేంద్ర సెహ్వాగ్ వ్యాఖ్యానించాడు. అయితే ఈ టోర్ని ఇంత సక్సెస్ అవుతుందని అసలు ఊహించలేదు అంటూ సెహ్వాగ్  చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: