భారత జట్టులో సీనియర్ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ గా కొనసాగుతున్న కేఎల్ రాహుల్ ఆట తీరు గత కొంతకాలం నుంచి తీవ్రస్థాయిలో చర్చనీయాంశంగా మారిపోయింది అని చెప్పాలి. వన్డే క్రికెట్, టెస్ట్ క్రికెట్ అనే తేడా లేకుండా అతని వైఫల్యం కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే అద్భుతమైన అటతీరుతో ఎప్పుడు జట్టు విజయంలో కీలక పాత్ర వహించే కేఎల్ రాహుల్ ఇక ఇప్పుడు ఓపెనర్ గా బరిలోకి దిగుతూ తక్కువ పరుగులకే పెవిలియన్ చేరుతూ ఉండడం జరుగుతూ ఉంది అని చెప్పాలి.


 అయితే అతను ఎంత ఫెలవమైన ప్రదర్శన చేసినప్పటికీ బీసీసీఐ మాత్రం వరుసగా అతనిని తుది జట్టులోకి తీసుకుంటూ ఉంది. ప్రస్తుతం భీకరమైన ఫామ్ లో కొనసాగుతూ సెంచరీల మోత మోగిస్తున్న గిల్ ను బెంచ్ పై కూర్చోబెట్టి కేఎల్ రాహుల్ కు అవకాశాలు ఇవ్వడం పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తూ ఉన్నాయి అని చెప్పాలి. అయితే ఇప్పుడు వరకు ఆస్ట్రేలియాతో జరిగిన రెండు మ్యాచ్లలో కూడా ఎక్కడా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు కేఎల్ రాహుల్. అయితే చివరి రెండు టెస్ట్ మ్యాచ్లు కూడా అతను ఆడుతాడని  కోచ్ రాహుల్ ద్రావిడ్ చెప్పడం మరింత ఆశ్చర్యానికి గురి చేసింది.


 అయితే కేఎల్ రాహుల్ వైఫల్యం పై స్పందించిన మాజీ క్రికెటర్ వెంకటేష్ ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కొంతమంది కే.ఎల్ రాహుల్ అంటే నాకు ఇష్టం లేదని మా ఇద్దరి మధ్య వ్యక్తిగత విభేదాలు ఉన్నాయని అనుకుంటూ ఉన్నారు. అయితే అది ఏ మాత్రం నిజం కాదు కేఎల్ రాహుల్కు మంచి జరగాలని నేను ఎప్పుడు కోరుకుంటా. అయితే ఇలాంటి ఫామ్ లో ఆడటం వల్ల అతని ఆత్మవిశ్వాసం మరింత దెబ్బతినే అవకాశం ఉంది. అతను మునుపటి ఫామ్ అందుకోవాలంటే ఇక రంజీ క్రికెట్ ఆడటం ఒక్కటే మార్గం. ఇప్పుడు రంజీలు కూడా ముగిసాయ్. అందుకే ఇంగ్లాండ్ వెళ్లి కౌంటిలలో అడిగి తిరిగి పాము సంపాదించుకోవాలి. పూజార కూడా ఇదే చేశాడు. పూజారకి ఉన్నంత అనుభవం కూడా రాహుల్ కి లేదు. వంద టెస్టులు ఆడిన పూజారనే ఫామ్ కోల్పోతే పక్కన పెట్టినప్పుడు ఇక రాహుల్ ని ఆడించడంలో అర్థం లేదు. రాహుల్ బాగా ఆడాలంటే ఐపిఎల్ నుంచి తప్పుకుంటే బెటర్. అతను ఐపీఎల్ ఆడటం కంటే టీమిండియా కు ఆడటానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వగలడా? ఆన్సర్ అందరికి తెలుసు అంటూ వెంకటేష్ ప్రసాద్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: