భారత్లో క్రికెట్కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏకంగా క్రికెటర్లను ఆరాధ్య దైవంగా అభిమానిస్తూ ఉంటారు ఎంతో మంది క్రికెట్ ప్రేక్షకులు. ఇక క్రికెట్ మ్యాచ్ వస్తుందంటే చాలు నేరుగా స్టేడియం కు వెళ్లి మ్యాచ్ వీక్షించడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే భారత్లో క్రికెట్కు ఏర్పడిన ఈ క్రేజ్ కారణంగానే అటు బీసీసీఐకి కోట్ల రూపాయల ఆదాయం వస్తూ ఉంది అని చెప్పాలి.  ఇక ఈ క్రేజ్ కారణంగానే అటు ఐపీఎల్ కు.. ఏ దేశియా లీగ్ కి లేని విధంగా పాపులారిటీ సంపాదించుకుంది. అయితే భారత్లో క్రికెట్కు ఉన్న పాపులారిటీ కేవలం పురుషుల క్రికెట్ కి మాత్రమే పరిమితమైంది.


 మహిళా క్రికెటర్లు ఎంత బాగా రాణించినా ఎన్ని రికార్డులు కొల్లగొట్టిన వారు ఆడుతున్న మ్యాచ్లను చూసే ప్రేక్షకులు కనిపించడం లేదు. ఇలాంటి సమయంలో మహిళా క్రికెట్ ను ప్రోత్సహించడమే లక్ష్యంగా బీసీసిఐ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. పురుషుల క్రికెట్ తో సమానంగా మహిళా క్రికెటర్లకు వేతనాలు చెల్లించడమే కాదు వారి కోసం ప్రత్యేకంగా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ అని ఐపీఎల్ తరహాలో ఒక టోర్నీ ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఇక భారత మహిళా క్రికెటర్లు అటు ఐసిసి టోర్నీలలో కూడా సత్తా చాటు అదరగొడుతున్నారు అని చెప్పాలి.


 ఇలాంటి సమయంలో ఏకంగా గూగుల్ మాత్రం మహిళా క్రికెటర్లకు ఇంకా గుర్తింపు ఇవ్వలేదు అన్నది తెలుస్తుంది. ఇదే విషయంపై టీమిండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. మహిళా క్రికెటర్లకు సపోర్టుగా క్యాంపైన్ చేపట్టాడు అని చెప్పాలి. గూగుల్ లో ఇండియన్ టీం కెప్టెన్ ఎవరు సెర్చ్ చేస్తే రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా గురించి మాత్రమే వస్తుంది. అయితే మహిళా క్రికెట్కు సారధిగా ఉన్న హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్ కాదా?.. ఈ సమస్యను మనమే సృష్టించినట్లు అయితే.. ఇక సమస్యను పరిష్కరించే శక్తి కూడా మనకే ఉంటుంది అంటూ అటు యువరాజ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: