గత కొన్ని రోజుల నుంచి కూడా భారత క్రికెట్లో ఎక్కడ చూసినా ఒకే ప్లేయర్ గురించి తీవ్రమైన చర్చ జరుగుతూ ఉంది అని చెప్పాలి. ఇలా ఇటీవల కాలంలో చర్చల్లో నిలిచిన స్టార్ క్రికెటర్ ఎవరో కాదు టీమ్ ఇండియా ఓపెనర్ కేఎల్ రాహుల్. సాధారణంగా ఒకప్పుడు తన ఆట తీరుతో వార్తల్లో నిలిచేవాడు కేఎల్ రాహుల్. కానీ ఇప్పుడు వరుస వైఫల్యాలతో వార్తల్లో నిలుస్తూ ఉన్నాడు అని చెప్పాలి. టెస్ట్ ఫార్మాట్, వన్డే ఫార్మాట్ అనే తేడా లేకుండా అన్ని ఫార్మట్లలో కూడా పేలవా ప్రదర్శన చేస్తూ టీమ్ ఇండియాకు మైనస్ గా మారిపోతూ ఉన్నాడు కేఎల్ రాహుల్.


 అయితే అతను మంచి టాలెంట్ ఉన్న ప్లేయర్ కావడంతో అతని ప్రతిభను నమ్మి మళ్ళీ కమ్ బ్యాక్ ఇస్తాడు అని నమ్మకంతో అటు బీసీసీఐ వరుసగా అవకాశాలు ఇస్తుంది. అయినప్పటికీ కె.ఎల్ రాహుల్ మాత్రం ఇక వరుసగా మ్యాచ్లలో పేలవ ప్రదర్శనతోనే ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే అందరూ కూడా అతని వైఫల్యం పైన చర్చించుకుంటున్నారు. కొంతమంది అతన్ని జట్టు నుంచి పక్కన పెట్టాలి అంటూ ఘాటు విమర్శలు చేస్తూ ఉంటే.. మరి కొంతమంది బీసీసీఐ అతనికి మద్దతుగా నిలిచి ప్రస్తుతం గడ్డు పరిస్థితులనుంచి బయటపడేలా చూడాలి అని మరి కొంతమంది వ్యాఖ్యానిస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇదే విషయంపై టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ స్పందించాడు.


 స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్కు హర్భజన్ సింగ్ మద్దతుగా నిలిచాడు అని చెప్పాలి. ఫామ్ లేమీతో ఇబ్బంది పడుతున్నప్పుడు ఆటగాడిపై అదే పనిగా విమర్శలు చేయడం సరికాదు. ఏ ఆటగాడికైనా సరే సరిగ్గా ఆడనప్పుడు ముందు బాధపడేది అతనే. అయితే బాగా రాణించనప్పుడు పదేపదే విమర్శిస్తే ఒక ఆటగాడి మెంటాలిటీ దెబ్బతింటుంది. అయితే రాహుల్ మంచి టాలెంట్ ఉన్న ప్లేయర్. ఇక టీమ్ ఇండియాకు ఒక మంచి కమ్ బ్యాక్ ఇస్తాడని భావిస్తున్నాను అంటూ హర్భజన్ సింగ్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: