సౌత్ ఆఫ్రికా వేదికగా జరిగిన మహిళల టి20 వరల్డ్ కప్ లో టీమిండియా జోరు చూస్తే ఇక ఈసారి వరల్డ్ కప్ ని ముద్దాడటం ఖాయమని అందరూ భావించారు. ఎందుకంటే లీక్ మ్యాచ్ లలో భాగంగా జరిగిన నాలుగు మ్యాచ్లలో కూడా కేవలం ఒకే ఒక ఓటమి చవిచూసి మూడు విజయాలతో సెమీఫైనల్ లో అడుగు పెట్టింది టీమ్ ఇండియా జట్టు. ఈ క్రమంలోనే కీలకమైన సెమీఫైనల్ లో కూడా గెలవడం ఖాయమని అందరూ నమ్మకం పెట్టుకున్నప్పటికీ అలా జరగలేదు. ఎందుకంటే పటిష్టమైన ఆస్ట్రేలియా జట్టు భారత్ ను 5 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్ లో అడుగు పెట్టింది అని చెప్పాలి.



 అయితే టీమ్ ఇండియా ముందు భారీ టార్గెట్ ఉన్న సమయంలో అప్పటికే ఓపెనర్లు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది టీం ఇండియా. అలాంటి సమయంలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ హార్మన్ ప్రీత్ కౌర్ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడింది అని చెప్పాలి. హార్మన్ ప్రీత్ జోరు చూస్తే అలవోకగా జట్టుకి విజయం అందించడం ఖాయమని అందరూ భావించారు. కానీ ఊహించని రీతిలో సింపుల్ రన్ అవుట్ అయ్యి వికెట్ కోల్పోయింది హార్మన్ ప్రీత్ కౌర్. అయితే తన బ్యాట్ మట్టిలో ఇరుక్కుపోవడంతోనే ఇలా జరిగిందని వివరణ కూడా ఇచ్చింది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక హర్మన్ ప్రీత్ కౌర్ పై కొంతమంది మాజీలు మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు.



 ఇటీవలే ఇదే విషయంపై టీమిండియా ఉమెన్స్ జట్టు మాజీ కెప్టెన్ అయినా డయానా ఎడుల్జీ స్పందిస్తూ అసంతృప్తి వ్యక్తం చేశారు హార్మన్ ప్రీత్ కౌర్. రెండో రన్ కోసం వచ్చేటప్పుడు జాగింగ్ చేస్తున్నట్లుగా ఉంది. నీ వికెట్ చాలా ముఖ్యమని తెలిసి కూడా అంత రిలాక్స్ గా ఎందుకు పరిగెత్తావు అంటూ ప్రశ్నించింది డయానా. గెలవాలి అంటే ప్రొఫెషనల్ క్రికెట్ ఆడాల్సిందే. ఆస్ట్రేలియా గెలుపు కోసం చివరి వరకు పోరాడింది. కానీ మనం అలా చేయలేదు. ప్రతిసారి కూడా ఇలా ఆఖరిపోరులో బోల్తా కొట్టడం అలవాటుగా మారిపోయింది అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది మాజీ కెప్టెన్ డయానా.

మరింత సమాచారం తెలుసుకోండి: