సాధారణంగా దేశవాళీ క్రికెట్లో సత్తా చాటి ఇక అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన తర్వాత ఏ ఆటగాడికైనా సరే సోషల్ మీడియాలో పాపులారిటీ ఒక్కసారిగా పెరిగిపోతూ ఉంటుంది. ఇక భారత్లో అయితే ఆ పాపులారిటీ ఊహ కందని రీతిలో పెరగడం ఖాయమని చెప్పాలి. ఇక టీమిండియాలోకి వచ్చిన ఆటగాడు ఎవరైనా మంచి ప్రదర్శన చేసి స్టార్ గా ఎదిగాడంటే ఏకంగా క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా అతనికి బ్రహ్మరథం పడుతూ ఉంటారు అని చెప్పాలి.



 ఇక అటు క్రికెటర్లు కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఇక ఫాలోవర్ల సంఖ్యను అంతకంతకు పెంచుకుంటూ ఉంటారు అని చెప్పాలి. ఇలా సోషల్ మీడియాలో కాస్త ఎక్కువగా యాక్టివ్గా ఉండే టీమిండియా స్టార్ క్రికెటర్లలో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా ఒకరు. తన ఆట తీరతో ఇప్పటికే కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న హార్థిక్  సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటాడు. ఇక ఫాలోవర్లను సంపాదించుకోవడంలో కూడా ముందుంటాడు అని చెప్పాలి.



 ఇలా సోషల్ మీడియా లో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే హార్దిక్ పాండ్య ఇటీవల ఒక అరుదైన రికార్డు సృష్టించాడు. ఇంస్టాగ్రామ్ లో ఏకంగా 25 మిలియన్ల ఫాలోవర్లను చేరుకున్నాడు హార్థిక్ పాండ్యా. దీంతో ఇంత మంది ఫాలోవర్లు కలిగిన అతిపిన్న వయస్కుడిగా హార్దిక్ పాండ్యా రికార్డు సృష్టించాడు అని చెప్పాలి. ఈ క్రమం లోనే హార్దిక్ పాండ్యా   అభిమానులు అందరూ కూడా అతనికి కంగ్రాట్యులేషన్స్ అంటూ సోషల్ మీడియాలో చెప్పేస్తున్నారు. ఇకపోతే ఇటీవల హార్దిక్ పాండ్యా తన భార్యను రెండోసారి పెళ్లి చేసుకోవడం.. ఇక ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తెగ హాట్ టాపిక్ గా మారిపోయాయి అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: