సాధారణంగా క్రికెట్లో బౌలర్లు వికెట్ తీయడమే లక్ష్యంగా ప్రతి బంతిని కూడా సంధిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇక బౌలర్లు అనుకున్నట్లుగానే ఒకవేళ వికెట్ దక్కితే వారి ఆనందానికి అవధులు ఉండవు. ఈ క్రమంలోనే ఇలా వికెట్ పడగొట్టిన ఆనందమైన క్షణాన్ని తమదైన శైలిలో సెలబ్రేట్ చేసుకోవడం లాంటివి చేస్తూ ఉంటాము. ఈ క్రమంలోనే ఒక్కో బౌలర్ ఒక్కో శైలులో సెలబ్రేషన్స్ చేసుకోవడం చూస్తూ ఉంటాం. అయితే కొంతమంది మాత్రం వింతైన సెలబ్రేషన్స్ చేసుకొని సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటారు అని చెప్పాలి.


 ఇక ఎవరైనా బౌలర్ ఇలా వికెట్ పడగొట్టిన సమయంలో వింత సెలబ్రేషన్స్ చేసుకున్నాడు అంటే చాలు.. అందుకు సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియా వేదికగా  వైరల్ గా మారిపోతూ ఉంటుంది. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. 2023 వన్డే ప్రపంచ కప్ క్వాలిఫైయర్ ఆశలను నేపాల్ జట్టు ఇటీవల సజీవంగా ఉంచుకుంది. యూఏఈ తో జరిగిన డూ ఆర్ డై మ్యాచ్లో 42 పరుగుల  తేడాతో విజయాన్ని అందుకుంది. తొలిత బ్యాటింగ్ చేస్తున్న నేపాల్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది.


 230 పరుగుల లక్ష్యంతో బలిలోకి దిగిన యూఏఈ జట్టు 45 ఓవర్లలో 187 పరుగులు మాత్రమే చేసి ఆల్ అవుట్ అయ్యింది అని చెప్పాలి. దీంతో డు ఆర్ డై మ్యాచ్ లో గెలిచిన నేపాల్ జట్టు సెలబ్రేషన్స్ లో మునిగిపోయింది. ఇక ఈ మ్యాచ్లో నేపాల్ బౌలర్ దీపేంద్ర సింగ్ మూడు వికెట్ల తీసి అదరగొట్టాడు. అయితే  ఇలా వికెట్ తీసిన సమయంలో దీపేంద్ర సింగ్ చేసుకున్న సెలబ్రేషన్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయాయి. యూఏఈ ఇన్నింగ్స్ సమయంలో 42 ఓవర్ వేశాడు దీపేంద్ర సింగ్. అద్భుతమైన క్యాచ్ అందుకొని ఆసిఫ్ ఖాన్ ను పెవిలియన్ పంపాడు. ఈ క్రమంలోనే దీపేంద్ర సింగ్ గ్రౌండ్లో పై ఫ్లిప్స్ వేసి వికెట్ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. ఇది చూసి అందరూ షాక్ అయ్యారు .

మరింత సమాచారం తెలుసుకోండి: