భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతుంది. అయితే ఇరూ జట్లు కూడా ఎంతో పటిష్టమైన టీమ్స్ కావడంతో ఇక టెస్టు సిరీస్ ఎంతో రసవత్తరంగా సాగుతుంది అని అందరూ భావించారు. కానీ మొదటి రెండు మ్యాచ్ లు కూడా పసలేని విధంగానే జరిగాయి అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే వార్ వన్ సైడ్ అన్నట్లుగానే టీమిండియా ఆట తీరు కొనసాగింది. ఇక ఆస్ట్రేలియా పై పూర్తి ఆధిపత్యం చలాయించి రెండు మ్యాచ్లలో కూడా ఘనవిజయాన్ని అందుకుంది భారత జట్టు.


 టీమిండియా జోరు చూస్తే అలవోకగా ఆస్ట్రేలియా పై విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకోవడమే కాదు.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో కూడా అడుగుపెడుతుంది అని అందరూ భావించారు. కానీ ఊహించని రీతిలో మూడో మ్యాచ్ నుంచి అద్భుతంగా పుంజుకుంది ఆస్ట్రేలియా. మూడో మ్యాచ్లో టీమ్ చిత్తుగా ఓడించింది. ఇక ఇప్పుడు నాలుగో మ్యాచ్లో కూడా అద్భుతమైన ప్రదర్శన చేస్తూ టీమ్ ఇండియాకు గట్టి పోటీ ఇస్తుంది అని చెప్పాలి. దీంతో ప్రస్తుతం ఇరుజట్ల మధ్య పోరు మరింత రసవతరంగా మారిపోయింది. కాగా ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్ లో 480 పరుగులు చేయగా.. ప్రస్తుతం భారత జట్టు తొలి ఇన్నింగ్స్ ఆడుతుంది.


 ఇకపోతే నాలుగో ఇన్నింగ్స్ లో రోహిత్ శర్మకు ఎదురైన సవాల్ గురించి మాజీ కోచ్ రవి శాస్త్రి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నాలుగో టెస్ట్ మ్యాచ్ కెప్టెన్ రోహిత్ శర్మకు ఎన్నో విషయాలు నేర్చుకోవడానికి చక్కని అవకాశం అంటూ తెలిపాడు.
 అహ్మదాబాద్ పిచ్ పై వికెట్లు వేగంగా పడకపోవడంతో ఉన్న బౌలింగ్ వనరులను వినియోగించుకోవాల్సి ఉంటుంది అంటూ రవి శాస్త్రి తెలిపాడు. కఠిన పరిస్థితుల్లో జట్టును ముందుకు నడిపించడం సవాలుతో కూడుకున్నది. అయితే టెస్ట్ క్రికెట్లో ఇక భాగస్వామ్యాలు ఏర్పడినప్పుడు ముందుగా.. ఆ భాగస్వామ్యాన్ని విడగొట్టేందుకు వ్యూహాలు సిద్ధం చేసుకోవాలి అంటూ రవిశాస్త్రి  సూచించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: