ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఊహించని రీతిలో ఫాన్ ఫాలోయింగ్ ఉంది అన్న విషయం తెలిసిందే. ఏకంగా ఐదుసార్లు కప్పు గెలిచిన ముంబై ఇండియన్స్ కి నాలుగు సార్లు టైటిల్ విజేతగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ కి ఎంతల అభిమానులు ఉన్నారో.. ఇక ఒక్కసారి కూడా కప్పు గెలవని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కి అదే రీతిలో అభిమానులు ఉన్నారు. ఇక ఇంతలా అభిమానుల నుంచి మద్దతు ఉన్నప్పటికీ ఎందుకో బెంగళూరు జట్టు మాత్రం టైటిల్ గెలవాలనే కలను నిజం చేసుకోలేక పోతుంది అనిచెప్పాలి. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో బరిలోకి దిగి ప్రతి ఏడాది నిరాశపరిచిన బెంగళూరు జట్టు.. ఇక డూప్లెసెస్ కెప్టెన్సీ లో బరిలోకి దిగిన అదే వైఫల్యాన్ని కొనసాగించింది.


లీగ్ మ్యాచ్లలో సత్తా చాటి ఇక నాకౌట్ దశకు వచ్చేసరికి ఒత్తిడికి తలవంచి ఓటమితో ఇంటిదారి పడుతూ ఉంటుంది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు. అయితే ఐపీఎల్ లో ఎలాగో 15 సీజన్లలో టైటిల్ గెలవాలనే కల నెరవేర లేదు కనీసం ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో అయినా ఆ కళ నెరవేరుతుందేమో అని బెంగళూరు జట్టు అభిమానులు అందరూ ఎంతో ఆశగా ఎదురు చూసారు. కానీ ఐపీఎల్ కు మించిన వైఫల్యాన్ని ఇక ఇప్పుడు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో కొనసాగిస్తుంది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు. ఎంతోమంది స్టార్ ప్లేయర్లు ఉన్న వరుస పరాజయాలతో సతమతమవుతుంది అని చెప్పాలి.


 ఇప్పుడు వరకు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో నాలుగు మ్యాచ్ లు ఆడిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఉమెన్స్ జట్టు.. నాలుగింటిలో కూడా ఓడిపోయింది. గుజరాత్ చేతిలో ఓడిపోయి పరాజయాలతో హ్యాట్రిక్ కొట్టిన ఆర్సిబి ఇక ఇప్పుడు యూపీ వారియర్స్ చేతిలో కూడా ఓడిపోయింది. అది కూడా 10 వికెట్ల తేడాతో ఘోర ఓటమి చవిచూసింది. దీంతో బెంగళూరు జట్టు అభిమానులు అందరూ కూడా నిరాశలో మునిగిపోతున్నారు. ఐపీఎల్లో అనుకున్నాం కానీ ఇక ఇప్పుడు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో అయితే బెంగళూరు జట్టు పరిస్థితి మరింత అద్వానంగా ఉంది అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు ఫ్యాన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి:

Wpl