ప్రస్తుతం భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా టెస్ట్ సిరీస్ జరుగుతుంది అని చెప్పాలి. అయితే ఈ టెస్ట్ సిరీస్ అటు భారత జట్టుకు ఎంతో కీలకంగా మారిపోయింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో అడుగు పెట్టాలి అంటే తప్పనిసరిగా టెస్ట్ సిరీస్ లో విజయం సాధించాల్సిన పరిస్థితి ఉంది అని చెప్పాలి. అయితే మొదటి రెండు మ్యాచ్లలో భారత జట్టు విజయం సాధించడంతో ఇక డబ్ల్యూటీసి ఫైనల్ లో అడుగుపెట్టడం ఖాయం అని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని రీతిలో మూడో టెస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియా పుంజుకుంది..


 దీంతో ఇక నాలుగో మ్యాచ్లో టీమిండియా తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి. అయితే ప్రస్తుతం అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న నాలుగో మ్యాచ్ పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉండడంతో పరుగుల వరద పారుతుంది అని చెప్పాలి. మొదటి మూడు మ్యాచ్లలో సింగిల్స్ తీయడానికే ఇబ్బంది పడిపోయినా ఇరుజట్ల బ్యాట్స్మెన్లు ఇక ఇప్పుడు బౌండరీలతో చెలరేగిపోతున్నారు. సెంచరీల మోత మోగిస్తున్నారు. అయితే నువ్వా నేనా అన్నట్లుగానే చివరి టేస్ట్ మాచ్ జరుగుతుంది అని చెప్పాలి. అయితే ఒకవేళ నాలుగో టెస్ట్ మ్యాచ్ డ్రా గా ముగిస్తే పరిస్థితి ఏంటి అన్న ప్రశ్న ప్రతి ఒక్కరిలో తలెత్తుతుంది.


 ఒకవేళ దురదృష్టవశాత్తు భారత జట్టు గెలవలేక ఇక మ్యాచ్ డ్రాగ ముగిస్తే.. ఇక టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో అడుగుపెడుతుందా లేదా అన్న విషయం తెలుసుకోవడానికి అందరూ ఆసక్తి చూపుతున్నారు అని చెప్పాలి. ఒకవేళ చివరి మ్యాచ్ డ్రాగ ముగిస్తే ఇక సిరీస్ ను రెండు ఒకటి తేడాతో భారత జట్టు కైవసం చేసుకుంటుంది. కానీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో చేరాలంటే మాత్రం న్యూజిలాండ్ శ్రీలంక మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్లో.. లంక ఒక మ్యాచ్లో ఓడిపోవాల్సి ఉంటుంది. తొలి మ్యాచ్ లోనే కివీస్ గెలుపొందితే రెండో టెస్ట్ ఫలితం పై ఇక భారత డిప్యూటీసి ఫైనల్ బెర్త్ ఆధారపడి ఉండదు. ఒకవేళ శ్రీలంక న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండు టెస్టులు డ్రా అయినా కూడా భారత్ డబ్ల్యుటిసి ఫైనల్ లో అడుగుపెడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: