గత కొన్ని రోజుల నుంచి భారత క్రికెట్ ప్రేక్షకులు అందరూ కోరుకుంటున్న రెండు కోరికలు తీరిపోయాయి. అవేంటో కాదు భారత జట్టు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో అడుగు పెట్టాలని అభిమానులు బలంగా కోరుకున్నారు. న్యూజిలాండ్, శ్రీలంక మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో భాగంగా మొదటి మ్యాచ్లో న్యూజిలాండ్ రెండు వికెట్ల తేడాతో శ్రీలంకను ఓడించింది.  దీంతో ఇక నాలుగో మ్యాచ్ ఫలితం గురించి అవసరం లేకుండానే టీమ్ ఇండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో అడుగు పెట్టింది అని చెప్పాలి.


 ఇక అదే సమయంలో ఇక గత కొన్నేల్లా నుంచి కూడా వరుసగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గెలుచుకుంటూ వస్తున్న టీమ్ ఇండియా ఇక ఏడాది కూడా ఈ సిరీస్ లో విజయం సాధించాలని భారత అభిమానులు కోరుకున్నారు. ఇక అనుకున్నట్లుగానే హోరాహోరీగా జరిగిన చివరి మ్యాచ్ డ్రాగ ముగియడంతో 2-1 తేడాతో టీమిండియా సిరీస్ కైవసం చేసుకుంది అని చెప్పాలి. దీంతో ఇక భారత అభిమానులు కోరుకున్న రెండు కోరికలు కూడా తీరిపోయాయి అని చెప్పాలి. దీంతో భారత అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి అని చెప్పాలి.



 ఇకపోతే ఇక ఆస్ట్రేలియా తో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్ గెలిపించిన కెప్టెన్ రోహిత్ శర్మ ఈ సిరీస్ గెలవడం గురించి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నాలుగు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ను గెలుచుకోవడం సంతోషంగా ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. ఇది అద్భుతమైన సిరీస్ ఢిల్లీ టెస్టులో తొలుతా మేం వెనకబడినప్పటికీ అద్భుతంగా పుంజుకొని  విజయం సాధించడం గర్వంగా ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. ఇండోర్ టెస్ట్ లో మేము ఒత్తిడితోనే ఓడిపోయాం. కానీ చివరి మ్యాచ్ లో గెలవడానికి ఎంతో కష్టపడ్డాం. టెస్ట్ క్రికెట్ అనేది ఎంతో కష్టంతో కూడుకున్నది. ఈ ఫార్మాట్లో ఆడటం అంత సులభం కాదు అంటూ రోహిత్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: