ముంబై ఇండియన్స్.. ఈ పేరు వినిపించింది అంటే చాలు అది ఒక ఛాంపియన్ టీం అనే భారత క్రికెట్ ప్రేక్షకులందరూ కూడా చెబుతూ ఉంటారు . ఎందుకంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఆ రేంజ్ లో ప్రస్థానాన్ని కొనసాగించింది ముంబై ఇండియన్స్ అతి తక్కువ సమయంలోనే రోహిత్ శర్మ కెప్టెన్సీ లో ఐదు సార్లు ఐపీఎల్ టైటిల్ గెలుచుకుంది. ఇప్పటివరకు  ఏ జట్టుకు కూడా ఇలా ఐదు సార్లు టైటిల్ గెలుచుకోవడం సాధ్యం కాలేదు అని చెప్పాలి. ఐపిఎల్ లో ఛాంపియన్ జట్టుగా కొనసాగుతున్న చెన్నై సూపర్ కింగ్స్ ను సైతం వెనక్కి నెట్టి ఈ ఘనత సాధించింది ముంబై ఇండియన్స్ జట్టు.


 అయితే ముంబై ఇండియన్స్ అంటే కేవలం ఒక జట్టు మాత్రమే కాదు అది ఒక బ్రాండ్ అన్నట్లుగా ముద్ర పడిపోయింది అని చెప్పాలి. ఇక ఈ బ్రాండ్ హవా ఇక ఇప్పుడు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో కూడా అదే రేంజ్ లో కొనసాగిస్తుంది ముంబై ఇండియన్స్.  హార్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్సీ లో బరిలోకి దిగుతున్న ముంబై ఇండియన్స్ వరుస విజయాలు సాధిస్తూ దూసుకుపోతుంది. ఓటమి ఎరుగని జట్టుగా రికార్డు సృష్టిస్తుంది. ఇక ఇటీవలే వరుసగా ఐదవ విజయాన్ని కూడా సాధించింది అని చెప్పాలి. గుజరాత్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్లో 55 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది.


 అయితే ఇక ఇలా వరుసగా ఐదు విజయాలు సాధించిన ముంబై ఇండియన్స్ జట్టు ఇక ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో మొదటగా ప్లే ఆఫ్ లో అర్హత సాధించిన మొదటి జట్టుగా నిలిచింది అని చెప్పాలి. ఇకపోతే ఇటీవలే గుజరాత్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. ఇక ఆ తర్వాత 163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ జట్టు 107 పరుగులకే కుప్పకూలిపోయింది అని చెప్పాలి. దీంతో 55 పరుగుల తేడాతో ముంబై ఘన విజయాన్ని అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl