
ఎంతలా అంటే జట్టులో స్టార్ ప్లేయర్లు ఉన్నప్పటికీ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో బెంగళూరు జట్టు వరుసగా 5 పరాజయాలు చవిచూసింది. ఆ తర్వాత ప్రత్యర్థికి ఎక్కడా పోటీ ఇవ్వలేక టోర్నీ నుంచి నిష్క్రమించిన మొదటి జట్టుగా చెత్త రికార్డును కూడా సృష్టించింది అని చెప్పాలి. మొత్తంగా ఏడు మ్యాచ్ లలో కేవలం రెండు మ్యాచ్ లలో మాత్రమే విజయం సాధించి తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మొత్తంలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ప్లేయర్గా ఉన్న స్మృతి మందాన ఇప్పుడు విమర్శలు ఎదుర్కొంటుంది అని చెప్పాలి.
ఈ క్రమంలోనే స్మృతి మందాన కెప్టెన్సీని విరాట్ కోహ్లీ కెప్టెన్సీ తో ఎంతో మంది భారత క్రికెట్ అభిమానులు పోల్చి చూస్తూ విమర్శలు చేస్తున్నారు. ఒకప్పుడు విరాట్ కోహ్లీ ఇక ఇప్పుడు స్మృతి మందాన బెంగళూరు జట్టును గెలిపించడంలో విఫలమయ్యారు అంటున్నారు. అయితే కేవలం కెప్టెన్సీ విషయంలోనే కాదండోయ్ ఇక బౌలింగ్ విషయంలో కూడా ఈ ఇద్దరు సేమ్ టు సేమ్ అన్నది తెలుస్తుంది. ఎందుకంటే ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ట్విట్టర్ వేదిక వైరల్ గా మారింది. గతంలో విరాట్ కోహ్లీ బౌలింగ్ చేసిన వీడియో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో స్మృతి మందాన బౌలింగ్ చేసిన వీడియో చూస్తే వీళ్లిద్దరి బౌలింగ్ యాక్షన్ సేమ్ ఒకేలాగా ఉండడం గమనార్హం.