2023 ఐపీఎల్ సీజన్ కోసం గత ఏడాది డిసెంబర్లో జరిగిన మినీ వేలంలో ఎన్నో జట్లు ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరించాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఆ సమయంలో అంతర్జాతీయ క్రికెట్లో బాగా రాణిస్తూ మంచి ఫామ్ కనబరుస్తున్న ఆటగాలను ఇక భారీ ధర పెట్టి కొనుగోలు చేయడానికి కూడా సిద్ధపడ్డాయి. ఈ క్రమంలోనే సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు సైతం ఒక యువ ఆల్ రౌండర్ కోసం భారీ మొత్తంలో ఖర్చు పెట్టింది అన్న విషయం తెలుస్తుంది. ఇంగ్లాండులో పవర్ హిట్టర్ గా పేరు సంపాదించుకున్న హ్యారీ బ్రూక్స్ కోసం 13.25 కోట్లు పెట్టింది సన్రైజర్స్ జట్టు యాజమాన్యం.


 అయితే ఆ సమయంలో ఇంగ్లాండ్ జట్టు తరఫున ఎన్నో మెరుపు ఇన్నింగ్స్ ఆడుతూ సూపర్ ఫామ్ లో కనబరిచాడు హ్యారి బ్రూక్స్. ఇక అతని ఫామ్ అటు సన్రైజర్స్ కి కూడా ఎంతగానో ఉపయోగపడుతుందని అభిమానులు కూడా భావించారు. కానీ అతని ప్రతిభ గురించి సన్రైజర్స్ కాస్త ఎక్కువగా అంచనా వేసిందని.. కొంతమంది మాజీ ఆటగాళ్లు కూడా అభిప్రాయపడ్డారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఇప్పుడు మాజీ ఆటగాళ్ళు చెప్పిందే నిజం అవుతుంది అన్నది తెలుస్తుంది. ఎందుకంటే 13.25 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన ఆటగాడు జట్టుకు ఎక్కడ ఉపయోగపడటం లేదు.


 రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్లో చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. దీంతో ఇక ఇప్పుడు లక్నోతో జరగబోయే రెండో మ్యాచ్లో ఈ భారీ ధర పలికిన ఆటగాడినే పక్కకు పెట్టేందుకు జట్టు యాజమాన్యం నిర్ణయించింది అన్నది తెలుస్తుంది. కెప్టెన్ మార్కరమ్ జట్టులోకి రావడంతో ఎవరో ఒకరిని తప్పించాలి. దీంతో పేలవమైన  ఫామ్ కనబరిచిన హ్యారి బ్రూక్స్ ను పక్కన పెట్టాలని జట్టు యాజమాన్యం అనుకుంటుందట. ఈ విషయం తెలిసి సన్రైజర్స్ ఫాన్స్ షాక్ అవుతున్నారు. ఆటగాడిపై అంత నమ్మకం లేనప్పుడు అంత భారీ ధర పెట్టడం ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl