టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని వికెట్ల వెనకాల కీపింగ్ చేస్తూ ఇక మ్యాచ్ మొత్తాన్ని కూడా ఎలా శాసిస్తూ ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే మ్యాచ్ ను తన వైపుకు తిప్పుకోగల సమర్థుడు మహేంద్ర సింగ్ ధోని. ఇక వికెట్ల వెనకాల ఉండి బౌలర్లకు సలహాలు ఇస్తూ ఇక ఎంతో విజయవంతంగా వికెట్లు పడగొట్టడంలో సహాయం చేస్తూ ఉంటాడు అని చెప్పాలి. అంతేకాదు చిన్న ఛాన్స్ దొరికిన కూడా బ్యాట్స్మెన్ను స్టంప్ అవుట్ చేసి పెవిలియన్ పంపించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు.

 ఇలా వికెట్ల వెనకాల మహేంద్ర సింగ్ ధోనీ చేసే ఫీల్డింగ్  విన్యాసాలు ప్రేక్షకులు అందరిని కూడా అబ్బురపరుస్తూ ఉంటాయి అని చెప్పడంలోనూ అతిశయోక్తి లేదు. అలాంటి మహేంద్ర సింగ్ ధోని ఇక అటు ఐపీఎల్ లో కూడా తన కీపింగ్ నైపుణ్యాలతో మెరుస్తూ ఉంటాడు అని చెప్పాలి. ఇక  రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో కూడా మెరుపు వేగంతో స్టంప్ అవుట్ చేసి మరోసారి అభిమానులను ఆశ్చర్యపరిచాడు మహేంద్రసింగ్ ధోని. రాజస్థాన్ ఇన్నింగ్స్ సమయంలో ఆఖరి ఓవర్ ను తుషార్ దేశ్ పాండే వేశాడు.



 ఈ క్రమంలోనే బ్యాటింగ్ చేస్తున్న ఆడమ్ జంప షార్ట్ ఫైన్ లైక్ దిశగా బంతిని ఆడాడు. అయితే తీక్షణ క్యాచ్ వదిలేయడంతో సింగిల్ పూర్తి చేసి రెండో పరుగు కోసం ప్రయత్నించాడు ఆడం జంప. అయితే క్యాచ్ మిస్ చేసినప్పటికీ తీక్షణ సరైన సమయంలో ధోని చేతికి త్రో విసిరాడు. దీంతో త్రో అందుకున్న మహేంద్రసింగ్ ధోని ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా నేరుగా వికెట్లను గిరాటేశాడు. ఇక ఇదే సమయంలో తుషార్ దేశ్ పాండే తనకు బంతి వేయమని ధోనిని అడగడం గమనించవచ్చు. కానీ ధోని మాత్రం ఎవరికీ అవకాశం ఇవ్వకూడదు అని భావించి.. తానే రనౌట్ చేశాడు అని చెప్పాలి. ఇలా మెరుపు వేగంతో ధోని రనౌట్ చేయడంతో అభిమానులు ఇది చూసి మురిసిపోతున్నారు. ధోని చేతిలోకి బంతి వచ్చాక ఇక పరిస్థితి ఇలాగే ఉంటుంది అని కామెంట్లు చేస్తున్నారు ఫ్యాన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి: