ఈ ఏడాది జట్టును తప్పనిసరిగా గెలిపించాలని కంకణం కట్టుకుని వచ్చాడో లేదా ఇంకేం అనుకున్నాడో తెలియదు కానీ.. ఇక 2023 ఐపీఎల్ సీజన్లో మహేంద్ర సింగ్ ధోని వింటేజ్ మహేంద్రుడిలా కనిపిస్తున్నాడు అన్న విషయం తెలిసిందే. మైదానంలో దిగడమే ఆలస్యం సిక్సర్లు ఫోర్రలతో చెలరేగిపోతున్నాడు మహేంద్ర సింగ్ ధోని. చివర్లో వచ్చి ఇక తన మెరుపు ఇన్నింగ్స్ తో అభిమానులు అందరిని కూడా ఉర్రూతలూగిస్తున్నాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


 ఇటీవల రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో కూడా మహేంద్ర సింగ్ ధోని ఇలాగే మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. చివరి ఓవర్లో 21 పరుగులు కావలసిన సమయంలో ఇక మహేంద్ర సింగ్ ధోని వరుసగా రెండు సిక్సర్లు కొట్టి మ్యాచ్ ను చెన్నై సూపర్ కింగ్స్ చేతుల్లోకి తెచ్చేసాడు. కానీ ఆ తర్వాత సందీప్ శర్మ ఎంతో తెలివిగా బౌలింగ్ వేయడంతో చివరికి మూడు పరుగుల తేడాతో అటు చెన్నై సూపర్ కింగ్స్ ఓడిపోయింది. అయితే మ్యాచ్ విషయం పక్కన పెడితే చెన్నై కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని కి గాయం అయింది అన్న వార్త మాత్రం అభిమానులను ఆందోళనకు గురిచేస్తుంది.



 మహేంద్ర సింగ్ ధోని మోకాలి నొప్పి తో బాధపడుతున్నట్లు ఆ జట్టు కోచ్ గా ఉన్న స్టీఫెన్ ఫ్లెమింగ్ ప్రకటించారు. దీంతో ధోని తర్వాత మ్యాచ్లకి అందుబాటులో ఉంటాడా లేదా అన్నది మాత్రం అభిమానుల్లో ఆందోళన మొదలైంది అని చెప్పాలి. ఇకపోతే చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం సైతం ట్విట్టర్ వేదికగా ధోని మోకాలి నొప్పితో బాధపడుతున్న ఒక వీడియోను షేర్ చేసింది. ఈ వీడియోలో పెవిలియన్ వెళ్తున్న మహేంద్ర సింగ్ ధోని అసలు నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్నట్లుగా కనిపిస్తుంది. దీంతో ధోనికి ఏమైంది క్లారిటీ ఇవ్వాలి అంటూ ఇక అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: