సాధారణంగా క్రికెట్లో ఎప్పుడు ఎంతో మంది ఆటగాళ్లు రికార్డులు సృష్టించడం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రపంచ క్రికెట్లో మేటి జట్లుగా కొనసాగుతున్న టీమ్లలో ఆడుతూ ఆటగాళ్లు ఇలా ఎక్కువగా రికార్డులు కొల్లగొట్టడం గురించి చూస్తూ ఉంటాం. ఎప్పుడు అత్యుత్తమమైన ప్రదర్శన చేసి  అదరగొడుతూ ఉంటారు ఆయా జట్ల ఆటగాళ్లు. ఇక వాళ్లే ప్రపంచ క్రికెట్లో స్టార్ ప్లేయర్లుగా కొనసాగుతూ ఉంటారు. అయితే ఇలా క్రికెట్లో ఎవరైనా ఆటగాడు రికార్డు సాధించాడు అంటే చాలు ఆ వార్త కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది.


 ఈ క్రమంలోనే ఇలా ఏదైనా ప్రపంచ రికార్డుకు సంబంధించిన వార్త తెరమీదకి వస్తే ప్రపంచ క్రికెట్లో ఉన్న స్టార్ ప్లేయర్లలో ఎవరో ఒకరు ఈ రికార్డు సాధించి ఉంటారు అని అందరూ భావిస్తూ ఉంటారు. ఇటీవల ఒక వరల్డ్ రికార్డుకు సంబంధించిన వార్త వైరల్ గా మారగా నేటిజన్స్ అందరు కూడా ఇలాగే స్టార్ క్రికెటర్లే ఈ రికార్డు సాధించి ఉంటారు భావించగా చివరికి అసలు విషయం తెలిసి షాక్ అవుతున్నారు. ఎందుకంటే ఒక పసికూన జట్టులో కొనసాగుతున్న ప్లేయర్ ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కాని రీతిలో వన్డే క్రికెట్ చరిత్రలో ఒక అరుదైన రికార్డును నమోదు చేశాడు.



 దీంతో ఇలా వన్డే క్రికెట్ హిస్టరీలో ఒక సంచలనమే నమోదయింది అని చెప్పాలి. పసికూన నేపాల్ జట్టు ఆటగాడైన సందీప్ లమీచ్చనే వన్డే క్రికెట్లో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన బౌలర్గా రికార్డు సృష్టించాడు. కేవలం 42 మ్యాచ్ లలోనే ఈ ఘనత సాధించాడు సందీప్. గతంలో రషీద్ ఖాన్ 44 మ్యాచ్ లలో 100 రికార్డులు సాధించగా.. ఇదే అత్యంత వేగంగా 100 వికెట్లు సాధించిన రికార్డుగా ఉండేది. కానీ ఇప్పుడు సందీప్ ఈ రికార్డును బద్దలు కొట్టేసాడు. జాబితాలో మిచెల్ స్టార్క్ 52, సక్లైన్ ముస్తాక్53, ముస్తాఫిజుర్ రెహమాన్, షేన్ బాండ్ 54 వికెట్లతో ఉన్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: