ఐపీఎల్ హిస్టరీలో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన బౌలర్ల గురించి మాట్లాడుకుంటే కేవలం కొంతమంది పేరు మాత్రమే ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది అని చెప్పాలి. ఇలా కొంతమందిలో అటు ఆఫ్ఘనిస్తాన్ ఆల్రౌండర్ అయినా రషీద్ ఖాన్ కూడా ఒకడు. రషీద్ ఖాన్ ఇప్పటికే ప్రపంచ క్రికెట్లో తన స్పిన్ బౌలింగ్ తో ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నాడు. ఇక ఐపీఎల్ లో సైతం వివిధ జట్ల తరఫున ప్రాతినిధ్యం వహించి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని సంపాదించుకున్నాడు అని చెప్పాలి.



 రషీద్ ఖాన్ బౌలింగ్ చేస్తున్నాడు అంటే చాలు మహా మహా బ్యాట్స్మెన్లు లు సైతం పరుగులు చేయడం మానేసి వికెట్ను కాపాడుకోవడానికి ఎక్కువగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అంటే ఇక అతని స్పిన్ వైవిద్యం ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. గతంలో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకి ప్రాతినిధ్యం వహించిన రషీద్ ఖాన్ ఇక ఇప్పుడు గత ఏడాది ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్త టీం గుజరాత్ తరపున ఆడుతూ ఉన్నాడు. ఇకపోతే ఇటీవల ఇండియన్ ప్రీమియర్ లీగ్ హిస్టరీలో రషీద్ ఖాన్ తన 100వ మ్యాచ్ ఆడాడు అని చెప్పాలి.  సాధారణంగా 100వ మ్యాచ్ ఆడుతున్నప్పుడు ఏదైనా అరుదైన ఘనత సాధించాలని ప్రతి ఒక్క ప్లేయర్ భావిస్తూ ఉంటాడు.



 రషీద్ ఖాన్ కూడా అలాంటి ఆలోచనతోనే బరిలోకి దిగాడు. కానీ చివరికి 100వ మ్యాచ్లో అతని ఖాతాలో ఒక చెత్త రికార్డు చేరిపోయింది అని చెప్పాలి. గుజరాత్, కోల్కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఘన విజయాన్ని అందుకుంది గుజరాత్ టైటాన్స్ జట్టు. అయితే ఈ మ్యాచ్ లో 4 ఓవర్లు వేసిన రషీద్ ఖాన్ 54 పరుగులు ఇచ్చాడు. అంతేకాదు ఒక్క వికెట్ కూడా తీయలేదు. అయితే ఐపీఎల్లో అతను అత్యధిక పరుగులు సమర్పించుకున్న రెండో మ్యాచ్ ఇదే కావడం గమనార్హం. గతంలో సన్రైజర్స్ తరఫున ఆడుతూ పంజాబ్ కింగ్స్ పై నాలుగు ఓవర్లలో 55 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీసాడు. ఇలా ఎక్కువ పరుగులు ఇచ్చిన చెత్త రికార్డును మూట కట్టుకున్నాడు రషీద్ ఖాన్.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl