బీసీసీఐ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ద్వారా ప్రతి ఏడాది కూడా వేలకోట్ల రూపాయలు బిసిసిఐ ఖాతాలో వచ్చి చేరుతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇలా ఐపీఎల్ కారణంగా బీసీసీఐ ప్రతి ఏడాది కూడా లాభాలను పెంచుకుంటూనే పోతూ ఉంది. దీంతో ఇక ఐపీఎల్ నిర్వహణపై ఎప్పుడూ ఆసక్తి చూపుతూనే ఉంటుంది అనే విషయం తెలిసిందే. కానీ ఈ ఐపిఎల్ సీజన్ మాత్రం అటు బీసీసీఐ ని భయపెడుతూ ఉండడం గమనార్హం. అదేంటి ఎప్పటిలాగానే ఈ సీజన్లో కూడా లాభాలు వస్తాయి కదా ఇంకా బీసీసీఐకి భయం ఎందుకుఅని అనుకుంటున్నారు కదా.


 అయితే బిసిసిఐ భయం లాభాల విషయంలో కాదు.. ఇక ఐపీఎల్ ముగిసిన వెంటనే జరగబోయే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ విషయంలో అని చెప్పాలి. ఎందుకంటే ఐపీఎల్ ఫైనల్ జరిగిన కేవలం వారం రోజుల వ్యవధిలోనే.. ఇంగ్లాండులోని ఓవల్ వేదికగా డబ్ల్యూటీసి ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. ఈ ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియాతో తలబడబోతుంది టీమిండియా. అయితే ఇక ఫైనల్ కోసం ఇప్పటికే 15 మంది జట్టు సభ్యులతో కూడిన వివరాలను ప్రకటించింది బీసీసీఐ. అయితే ఇలా డబ్ల్యూటీసి ఫైనల్ ఆడాల్సిన ఆటగాళ్లు ఇప్పుడు ఐపీఎల్ లో వివిధ జట్ల తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు.


 ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. కానీ డబ్ల్యూటీసి ఫైనల్ ఆడాల్సిన ఆటగాళ్లు ఐపిఎల్ లో మ్యాచ్లలో గాయాల బారిన పడుతూ ఉండడం అటు బీసీసీఐ ని భయపెడుతుంది. ఇక క్రికెట్ ఫ్యాన్స్ లో కూడా ఇలా గాయాల పెడదా ఆందోళన రేకెత్తిస్తుంది. ఇప్పటివరకు జస్ ప్రీత్ బుమ్రా శ్రేయస్ అయ్యర్ సర్జరీ కారణంగా జట్టుకు దూరమవ్వగా.. రిషబ్ పంత్   రోడ్డు ప్రమాదం కారణంగా ఇక అందుబాటులో లేని పరిస్థితి. ఇక ఇప్పుడు ఐపీఎల్ లో ఆడుతున్న కేఎల్ రాహుల్, జయదేవ్ గాయపడటంతో వీళ్ళు డబ్ల్యూటీసి ఫైనల్ కు ఆడటం అనుమానంగానే ఉంది. మరోవైపు ఉమేష్ యాదవ్, శార్దూల్ ఠాగూర్ సైతం పాత గాయాలు తిరగబెడుతున్నడంతో ఫిట్నెస్ సమస్యలతో బాధపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: