ఇటీవలే ఐపీఎల్లో భాగంగా కోల్కతా నైట్ రైడర్స్ పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ ఎంత ఉత్కంఠ భరితంగా సాగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చివరి బంతి వరకు కూడా నువ్వా నేనా అన్నట్లుగా సాగిన పోరులో చివరికి కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ఘన విజయాన్ని అందుకుంది. దీంతో ఫాన్స్ అందరు కూడా సంబరాల్లో మునిగిపోయారు అని చెప్పాలి. అయితే ప్లే ఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలి అంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్లో కోల్కతా అదరగొట్టింది. చివరి బంతికి మూడు పరుగులు కావలసిన సమయంలో రింకు సింగ్ అద్భుతమైన ఫోర్ కొట్టి జట్టును గెలిపించాడు.



 దీంతో కోల్కతా నైట్ రైడర్స్ అభిమానులందరూ కూడా సంతోషంలొ మునిగిపోయారు అని చెప్పాలి. అయితే అటు కోల్కతా కెప్టెన్ నితీష్ రానాకి మాత్రం జట్టు గెలిచిన ఆనందమే లేకుండా పోయింది. కోల్కతా నైట్ రైడర్స్ జట్టు పంజాబ్ కింగ్స్ పై గెలిచినప్పటికి.. ఇక ఆ జట్టు కెప్టెన్ నితీష్ రానాకు మాత్రం ఊహించని షాక్ తగిలింది. స్లో ఓవర్ రేట్ కారణంగా ఇక 12 లక్షల జరిమానా విధించింది ఐపీఎల్ యాజమాన్యం. నిర్ణీత సమయంలో ఓవర్ల కోటాను పూర్తి చేయడంలో విఫలం కావడంతో ఇక ఇలాంటి నిర్ణయం తీసుకుంది అని చెప్పాలి


 ఈ క్రమంలోనే ఐపిఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద కోల్కతా నైట్ రైడర్స్ జట్టు కెప్టెన్ గా ఉన్న నితీష్ రానాకు జరిమానా పడింది. అయితే ఇక ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో నితీష్ రానాకు జరిమానా పడటం ఇది రెండోసారి. అయితే గత నెల 16వ తేదీన ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్లో నితీష్ రాణ ఔట్ అయ్యి పెవిలియన్ కు వెళ్తున్న సమయంలో ముంబై బౌలర్ హృతిక్ తో గొడవపడ్డాడు. దీంతో నిబంధనలు ఉల్లంఘించినట్లు గాను మ్యాచ్ ఫీజులో 25% కోత విధిస్తూ రిపరీలు నిర్ణయం తీసుకున్నారు. ఇకపోతే 11 మ్యాచ్లలో ఐదు విజయాలు సాధించి పది పాయింట్లు సాధించిన కోల్కతా జట్టు ప్రస్తుత పాయింట్ల పట్టికలో ఐదవ స్థానంలో కొనసాగుతూ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl