సాధారణంగా క్రికెట్ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా  జరుగుతున్న సమయంలో ప్రతి మ్యాచ్ కూడా భారీగా పరుగులు చేయడానికి మైదానంలోకి అడుగుపెడుతూ ఉంటాడు బ్యాట్స్మెన్లు. ప్రత్యర్థి బౌలర్ల పై పూర్తి ఆధిపత్యం చెలాయించి పరుగుల సునామీ సృష్టించాలని ఆశపడటం సర్వసాధారణం. అయితే ఇలా కొంతమంది పట్టుదలతో పరుగులు చేస్తూ ఉంటే.. మరి కొంతమంది మాత్రం వికెట్ కోల్పోయి నిరాశగా వెళ్తూ ఉంటారు అని చెప్పాలి. కొంతమంది అయితే కనీసం పరుగుల ఖాతా కూడా తెరవకుండానే ఇలా వికెట్ కోల్పోవడం క్రికెట్ లో ఎన్నోసార్లు చూశాము.


 సాధారణంగా ఒక బ్యాట్స్మెన్ వికెట్ కోల్పోయాడు అంటే చాలు కనీసం ఒక్క బంతిని అయినా అతను ఎదుర్కొని ఉంటాడు. కానీ ఒక్క బంతి కూడా ఎదురుకోకుండా వికెట్ కోల్పోవడం అంటే అది క్రికెట్లో చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. అయితే ఇలాంటి అరుదైన ఘటన ఇటీవల ipl లో భాగంగా రాజస్థాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో కూడా ఇలాంటి అరుదైన ఘటనే జరిగింది. సాధారణంగా బ్యాట్స్మెన్ ఆడిన మొదటి బంతికే వికెట్ కోల్పోతే గోల్డెన్ డకౌట్ అంటారు.


 కొన్ని బంతులు ఆడిన తర్వాత ఇక పరుగుల ఖాతా తెరవకుండా వికెట్ కోల్పోతే.. డగ్ అవుట్ అంటారు. కానీ ఇక్కడ రవిచంద్రన్ అశ్విన్ మాత్రం డైమండ్ డక్ అవుట్ అయ్యాడు. ఈ మాట ఎక్కడ విన్నట్టు అనిపించడం లేదు కదా.. నిజమే ఇది క్రికెట్ లో చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. బెంగళూరు తో మ్యాచ్లో రాజస్థాన్ ప్లేయర్ అశ్విన్ ఒక బంతి కూడా ఆడకుండానే ఓయ్ అయ్యి డైమండ్ డకౌట్ గా వెనుతిరిగాడు. ఎనిమిదో ఓవర్లో రన్ కు ప్రయత్నించి రన్ అవుట్ అయ్యాడు. ఇలా ఒక బంతిని కూడా ఆడకుండా అవుట్ అయితే దీనిని డైమండ్ డక్ అవుట్ అని పిలుస్తూ ఉంటారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: