ఇండియన్ ప్రీమియర్ లీగ్ హిస్టరీలో మోస్ట్ సక్సెస్ఫుల్ టీం ఏది అంటే అందరికీ ముందుగా ముంబై ఇండియన్స్ పేరు గుర్తుకు వస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు పది జట్లు  ఐపిఎల్ లో కొనసాగుతున్న అత్యధిక సార్లు టైటిల్ గెలిచిన టీం గా మాత్రం ముంబై ఇండియన్స్ కొనసాగుతుంది. ఏకంగా ఐదు సార్లు అతి తక్కువ సమయంలోనే ఐపిఎల్ టైటిల్ గెలిచిన జట్టుగా ఉంది ముంబై ఇండియన్స్. అయితే ఇక చెన్నై సూపర్ కింగ్స్ మినహా మిగతా ఏ టీం కూడా టైటిల్స్ గెలవడం విషయంలోముంబై కి పోటీ ఇవ్వలేకపోయింది అని చెప్పాలి.



 అలాంటి ముంబై ఇండియన్స్ జట్టు మాత్రం గత కొన్ని సీజన్ల నుంచి ఐపీఎల్ లో వరుస వైఫల్యాలతో ఇబ్బందిపడుతుంది. ఇక 2023 ఐపీఎల్ సీజన్లోనూ పడుతూ లేస్తూ ప్రయాణాన్ని సాగించింది ముంబై ఇండియన్స్ జట్టు. అయితే ఇటీవల ఒక మ్యాచ్లో ఘనవిజయాన్ని సాధించడం ద్వారా పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి దూసుకు వచ్చింది. దీంతో ప్లే ఆఫ్ లో అడుగు పెడుతుందా లేదా అని అనుమాన పడినవారు ఇక ముంబై మూడో స్థానంలోకి రావడంతో సంతోష పడిపోయారు అని చెప్పాలి. అయితే ప్లే ఆఫ్ లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలంటే తప్పక గెలవాల్సిన రెండు మ్యాచ్లలో ఒక మ్యాచ్ ఇప్పటికే ఓడిపోయింది ముంబై ఇండియన్స్.


 ఇటీవల లక్నోతో జరిగిన మ్యాచ్లో గెలవాల్సిన మ్యాచ్లో ఓడిపోయి విమర్శలు ఎదుర్కొంది. దీంతో ఇక ముంబై ప్లే ఆఫ్ ఛాన్సెస్ క్లిష్టంగా మారాయ్. 13 మ్యాచ్ లలో 7 గెలిచి 14 పాయింట్లతో  ఉన్న ముంబై చివరి మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ పై గెలిచిన ప్లే ఆఫ్ కు వెళ్లడం మిగతా జట్ల పైనే ఆధారపడి ఉంది. ఎందుకంటే ముంబై నెట్ రన్ రేట్ నెగిటివ్గా ఉంది. ఆర్ సి బి, పంజాబ్ చివరి రెండు మ్యాచ్లలో గెలిస్తే 16 పాయింట్లు సాధిస్తాయి. అప్పుడు ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్ లో అడుగు పెట్టాలంటే సన్రైజర్స్ పై భారీ తేడాతో విజయం సాధించాల్సి ఉంది అని చెప్పాలి. అయితే ఇప్పటికే ప్లే ఆఫ్ రేస్ నుంచి తప్పుకున్న సన్రైజర్స్ ముంబై తో మ్యాచ్లో ఓడిపోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl