ప్రతి వారం పనీ పాట లేకుండా మా కిట్టయ్య చెప్పే చెత్త పలుకులు, చెత్త కామెంట్స్ వింటే అబ్బబ్బ ఈ సమాజం అన్నా, ఈ మనుషులు అన్నా, తన కులం కానీ పాలకులన్నా ఎంత కడుపు మంటో, ఇట్టే అర్ధం అయిపోతుంది. ENO  తాగినా  కిట్టారావు కడుపు మంట చల్లారడం లేదు. ఉన్నదీ లేనిది తనది తన రాజగురువు, తన కులదైవం ఆ సెంద్రన్న కడుపు మంటని, తన కడుపు మంటని అన్నీ కలగలిపి మరీ రకరకాల కామెంట్స్ చేస్తూ, పూనకం వచ్చినట్టుగా ఊగిపోతున్నాడు. అసలు ఈ భూ పెపంచకం మీద తానొక్కడినే ఎవరినైనా తిట్టవచ్చు తప్ప తనను ఎవరూ తిట్ట కూడదు అన్నది కిట్టరావు ఇన్నర్ ఫీలింగు. పతీ వారం, ఇదే రకమైన చెత్త పలుకులు పలుకుతూ అసలు ఈ జర్నలిజం పుట్టుకకు కర్త, ఖర్మ, క్రియ తానే అన్నటుగా పలికే చెత్త పలుకులు మాములుగా ఉండవు. ఎప్పుడూ ఎదుటి వాడి ఇంట్లో ఏం జరుగుతుందో చెప్పడం తప్ప, తన ఇంట్లో ఏమి జరుగుతుందో ఈ కిట్టు కి అనవసరం. 

IHG


అసలే తెలంగాణ బాస్ కేచిఆర్ కి కాస్త తిక్క ఎక్కువ. అయినా పనిగట్టుకుని ఆయన్ను గెలుగుతున్నాడు. కరోనా తో జనాలు కుయ్యో మొర్రో అంటుంటే ... అవన్నీ వదిలేసి, ఆయన ఫామ్ హౌస్ లో బొబ్బుని ఉంటాడు. అసలు పాలన అంతా అధికారులే చేస్తున్నాడు. కరోనా వస్తుంటే మీరేం చేస్తున్నారు అంటూ తిక్క తిక్క ప్రశ్నలు వేస్తూ మరింత తిక్క లేపుతున్నారు. అదిగో ఆ కేచిఆర్ ఇలా చేసాడు.. అలా ఎందుకు చేయలేదు ..? ఇదేనా చిత్త శుద్ధి అంటూ తన పేపర్లోనూ, టీవీలోనూ వేశారు. మరి అన్నేసి మాటలు అన్నాక ఊరికే వదిలిస్తాడా ఏంటి ఆ కేచిఆర్ ? ఎవడో నా గురించి కారు కూతలు, బస్సు కూతలు కూస్తూ, అడ్డమైనది అచ్చేస్తున్నాడు ఆడికి కరోనా రావాలని కోరుకుంటున్నా అంటూ శాపనార్ధాలు పెట్టేసాడు. 

IHG

ఎంత ధైర్యం అడ్డమైన ప్రశ్నలు వేస్తూ అడ్డదిడ్డంగా ప్రచారాలు చేస్తున్న మీడియా అంటే మీకు అంత అలుసు అయిపోయిందా ..? ఎంత ధైర్యం నాకే కరోనా రావాలనుకుంటున్నారా అంటూ మళ్ళీ ఆ కేచిఆర్ ను గెలుకుతున్నాడు. అంతేనా మీది ఉడుత ఊపులు... మీ ఉడుత ఊపులకు ఎవరూ భయపడరు అంటూ మళ్ళీ మళ్ళీ రెచ్చగొట్టేస్తున్నాడు మా కిట్టయ్య. అసలు మీడియా అంటే ఏమనుకుంటున్నావోయ్ కేచిఆర్ జాగ్రత్త అన్నట్టుగా బెదిరించేస్తున్నాడు. అసలు తాను చెప్పినట్టుగానే ఏపీ, తెలంగాణల్లో పాలన ఉండాలి. ఆ జగన్ మొండోడు... నా మాట ఏంటి ..? ఎవడి మాట వినని సీతయ్య అంటూ తిట్టిపోస్తున్నాడు. అయినా అక్కడ ఆ దొర ... ఇక్కడ ఈ రెడ్డి అస్సలు తనని లెక్కచేయకుండా పూచిక పుల్లలా తీసిపడేస్తున్నారనే కదా అసలు ఈ కిట్టయ్య బాధ. 

IHG


ఇదిగో ఏమయ్యా జగనూ ... కేచిఆర్ అర్జెంటుగా కరోనా మీద సలహాలు కావాలని కరకట్ట కరోనానో ... లేక ఈ కిరసనాయిలు కిట్టూనో అడగండయ్య ...! లేకపోతే మరో వీకెండ్ కామెంట్ అంటూ అడ్డదిడ్డంగా రాసేసి... టీవీలో వాగేసి... ENO  మీద ENO  తాగేస్తాడు. అసలు కడుపు మంట మీద ఉన్నాడు కదా ...! 

మరింత సమాచారం తెలుసుకోండి: