సాధారణంగా కానీ, రాజకీయపరంగా కానీ పెపెంచ మేధావి ఎవరైనా ఉన్నారా అంటే అది ఖచ్చితంగా మా సెంద్రబాబే. ఏపీలో అంతా సీన్ లేదులే అని వెటకారంగా కామెంట్స్ చేసినా , తెలంగాణాలో సినిమా కాలిపోయింది అని క్యామిడి చేసినా, బాబుగారు మాత్రం అవేమీ పట్టించుకోరు సరికదా అసలు తన అంత గొప్పమనిషి ఎవరూ లేరు అన్నట్టుగానే వెటకారం చేసినా, అస్సలు పట్టించుకోను అన్నట్టుగా మొత్తం దులుపుకెళ్లిపోతుంటారు. అది వేరే సంగతి అనుకోండి. ఇప్పుడు సంగతి చూద్దాం...! అసలే ఏపీలో జగన్ దెబ్బ ఎలా ఉంటుందో ఈ మధ్యే రుచి చూస్తూ వస్తోన్న బాబు, ఆయన పార్టీ వాళ్లకి దిమ్మతిరిగి బొమ్మ కనిపించే విధంగా జగన్ సినిమా చూపిస్తున్నాడు. ఆ దెబ్బలు తిని తిని తట్టుకోలేని వాళ్ళు బాబోరు మీకో దణ్ణం మాకు మీరు వద్దు ... మీ పార్టీ వద్దు అంటూ జంపింగ్ లు చేస్తున్నారు. అవి అలాంటి ఇలాంటి జంపింగ్ లు కాదు.


 అసలు మళ్ళీ టీడీపీ వైపుకు చూసేది లేదు అన్నట్టుగా బాబు చినబాబుకు దండాలు పెట్టి మరీ జంప్ అయిపోతున్నారు. సర్లే విల్లా సంగతి ఇలా ఉంది అనుకుంటే... ఇప్పుడు తెలంగాణాలో మళ్ళీ సైకిల్ పార్టీని పరుగులు పెట్టించేందుకు బాబు సిద్ధం అయిపోయాడు. కేసీఆర్ , ఆయన పార్టీ మీద పెద్ద ఎత్తున విరుచుకుపడిపోతున్నారు. అసలు కేసీఆర్ సంగతేంటి ఆయనకు తిక్క రేగితే ఎం చేస్తాడో ఆయనకే తెలియదు. అయినా వాళ్లతో పేచీపెట్టుకుంటూ బాబోరు తెలంగాణా తమ్ముళ్ల ఫిలిం కాల్చేందుకు రెడీ అయిపోయారు. హలో బాసు ఇక్కడ ఉంది కేసీఆర్ , ఆ జగన్ లా జాలి చూపించి అయ్యో పాపం అని వదిలే రకం కాదు.


 అసలే ఇప్పటికే కేసీఆర్ తడాఖా చూపించగానే రాత్రి రాత్రికి తట్టా బుట్టా సర్దేసుకుని కరకట్టకు పరిగెత్తుకెళ్లిపోయావ్ ..! మనకెందుకు బాసు ఇదంతా ? అసలు ఏపీలో పార్టీ పరిస్థితే బాగాలేనప్పుడు తెలంగాణలో వేలుపెట్టి వాత వేయించుకోవడం ఎందుకు అంటూ ఉచిత సలహాలు ఇచ్చేందుకు తమ్ముళ్లు సిద్ధం అయినా బాబు మాత్రం నేను ఎవరి మాటా వినను అన్నట్టుగానే బాబు గారు వ్యవహరిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: