సీఎం కుర్చీ పోతే కానీ, అసలు విషయం అర్థం కాక నా కలల
రాజధాని అంటూ హడావుడి చేసి పారే స్తూ... కొంతమంది
పార్టీ వాళ్లతో రెంటుకు తెచ్చిన టెంట్లు వేసి .... అయ్యో నా
రాజధాని అంటూ హడావుడి చేస్తూ దీక్షలు, ధర్నాలు అంటూ కొద్ది రోజుల పాటు హడావుడి చేశారు. ఇప్పుడు రెంటలు కట్టలేక టెంటలు పీకలేక, జనాలు పెద్దగా రాకపోయినా, ఏదో అలా అలా నడిపించేస్తూ వస్తున్నారు. ఇప్పుడు
అమరావతి అనే ఊసు ఎత్తెందుకు కూడా ధైర్యం చేయలేకపోతున్నాడు. అలా ధైర్యం చేస్తే జరిగే నష్టం ఏమిటో, కష్టం ఏమిటో బాగా ఇప్పటికీ తెలిసి వచ్చినట్లుగా కనిపిస్తోంది. అందుకే , ఇప్పుడు
అమరావతి టెంట్ ల వైపు చూసేందుకు కూడా ఇష్టపడడం లేదు. పెద బాబు కానీ, చినబాబు కానీ ఇప్పుడు దైర్యమే చేయలేకపోతున్నారు.ఏమయ్యా బాబు నీకు
అమరావతి మాత్రమే కావాలా మా
సీమ సంగతి ఏంటి ? మా
ఉత్తరాంధ్ర గతి ఏంటి అంటూ గట్టిగా నోరేసుకుని
పార్టీ వొళ్ళు హడావుడి చేసినా నోరు ఎత్తలేని స్థితి దుస్థితి వచ్చి పడిపోయింది ఏం చేస్తాం అనుకుంటూ సైలెంట్ అయిపోయారు. అయ్యో పాపం.