ఎక్కడ బాధ పడాలో... ఎక్కడ సంతోషపడాలో తెలియనంత స్థాయిలో పార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఉండిపోవడం నిజంగా దురదృష్టకరం. ఎప్పుడు విక్టరీ సింబల్ చూపిస్తూ, విజయ దరహాసం ప్రదర్శించే బాబు గారు, విషాద సంఘటన లోనూ పైకి విచారం వ్యక్తం చేస్తూనే... విక్టరీ సింబల్ చూపిస్తూ , విజయకేతనం ఎగురవేసిన ట్లుగా వ్యవహరిస్తుండడం విమర్శల పాలు అవుతోంది కొద్ది రోజుల క్రితం విజయనగరం జిల్లా రామతీర్థం లో శ్రీరాములు విగ్రహానికి అపచారం జరిగింది.ఈ ఘటనకు కారకులైన ఎవరనేది ఇంకా తేలలేదు. ఈ సంగతి పక్కన పెడితే ఇటువంటి సంఘటనలు జరగడం దురదృష్టకరం.
సంఘటన జరిగిన ప్రాంతాన్ని అన్ని రాజకీయ పార్టీల నాయకులు సందర్శించారు. అదేవిధంగా బాబు గారు సందర్శించారు. ఇందులో బాబు గారి వెర్షన్ తప్పు పట్టడానికి ఏమీ లేదు. కానీ అక్కడికి వెళ్ళే క్రమంలో బూట్లు ధరించడమే కాకుండా,
విక్టరీ సింబల్ చూపిస్తూ, మంది మర్బలం తో వెళ్లడం అలవాటో ..పొరపాటో.. గ్రహపాటో తెలియడం లేదు. రాముని కేంద్రంగా రాజకీయాలు మొదలైపోయాయి. అక్కడ హడావుడి చేసి రాజకీయంగా ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు అన్ని పార్టీలు పడుతున్న శ్రమ అంతా ఇంతా కాదు. మత రాజకీయాలను తెరపైకి తెచ్చి ఈ విధంగా వ్యవహరించడం సరి కాదు. అందులోనూ ఎప్పుడు అందరికీ చెప్పడమే తప్ప, చెప్పించుకోవడం అలవాటులేని బాబు గారు ఇప్పుడు విజయ దరహాసంతో రెండు వేళ్ళు చూపిస్తూ , కొండ ఎక్కుతూ చేస్తున్న హడావుడి విమర్శల పాలవుతోంది.
అగ్గిపుల్ల వేశాం.. ఇక చలికాచు కోండి బాబు అన్నట్లుగా ఈ వ్యవహారాన్ని మొదలుపెట్టడంలో బాబు గారు
సక్సెస్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. కుట్రలు , కుతంత్రాలు ప్రభుత్వ పథకాలను లోపాలను ఎత్తి చూపిస్తే ప్రజలు హర్షిస్తారు. అలా కాకుండా మత రాజకీయాలకు తెర తీసి హేళన చేస్తూ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలనే లక్ష్యం తో విజయ దరహాసంతో ముందుకు వెళ్తున్న తీరు ఎన్నో ఎన్నో విమర్శలకు దారి తీస్తోంది.