స్వీడన్‌లో అత్యధికంగా సూర్యుడు ఆరు నెలల పాటు ఏకధాటిగా కనిపిస్తూనే ఉంటాడు. ఆ దేశంలో మే నుంచి ఆగస్ట్ మధ్య కాలంలో అర్ధరాత్రి అస్తమించిన సూర్యుడు. మళ్లీ ఉదయం 4.30 గంటల వరకు ఉదయిస్తాడు.
అర్ధరాత్రి సూర్యుడు ఉదయించే దేశంగా నార్వే దేశానికి గుర్తింపు ఉంది. ఆర్కిటిక్ సర్కిల్ లోపల ఉండే ఈ దేశంలో సూర్యడు మే నుంచి జులై మధ్య 76 రోజుల పాటు అసలు అస్తమించడు. నార్వేలో ఉన్న స్వాల్‌బార్డ్‌లో ఏప్రిల్ 10 నుంచి ఆగస్ట్ 23 మధ్య 76 రోజుల పాటు 24 గంటలు సూర్యుడు ప్రకాశిస్తూనే ఉంటాడు.
కెనడా దేశంలో ఉన్న చిన్న నగరం నునావట్‌లో భానుడు రెండు నెలల పాటు ప్రకాశిస్తూనే ఉంటాడు. అస్తమించడు. అదే సమయంలో శీతాకాలంలో మాత్రం ఈ ప్రాంతం 30 రోజుల పాటు పూర్తిగా చీకట్లోనే ఉండడం గమనార్హం.
యూరప్‌లో గ్రేట్ బ్రిటన్ తర్వాత అతి పెద్ద ద్వీపమైన ఐస్‌లాండ్‌లో జూన్ నెల మొత్తం ఆదిత్యుడు తన కిరణాలను వెలువరిస్తూనే ఉంటాడు. ఆ 30 రోజుల సమయంలో అక్కడి వారికి రాత్రి, పగలు అన్న తేడా కనిపించడు.
అమెరికాలోని అలస్కా రాష్ట్రంలో ఉన్న బారోలో మే నెల చివరి నుంచి జులై చివరి వరకూ రవి కిరణాలు భూమిపై నిరాటంకంగా పడుతూనే ఉంటాయి. ఇక నవంబర్ మొదటి నుంచి నెల రోజుల పాటు ఈ ప్రాంతంలో అసలు సూర్యుడు కనిపించడు.. అంటే పూర్తి చీకటిలోకి వెళ్లిపోతుంది అన్నమాట. దీనినే పోలార్ నైట్ గా పిలువబడుతుంది. ప్రపంచంలోని అందమైన గ్లేసియర్లకు ఈ ప్రాంతం నెలవైనది.
అందమైన సరస్సులు, ద్వీపాలకు నెలవుగా ఉన్న దేశం గా పేరున్న ఫిన్లాండ్‌లో సంవత్సరంలో 73 రోజుల పాటు ఆదిత్యుడు అస్తమించడం మనం చూడలేం. వేసవిలో ఈ వింతను మనం వేసవి కాలంలో ఆస్వాధించవచ్చు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి