మ‌నం ఇప్పుడు ఖ‌ర్చు చేస్తున్న ప్ర‌తి రూపాయి నుంచి రెండు వేల నోటు వ‌ర‌కు ప్ర‌తీది రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసిందే. క‌రెన్సీ నోట్లను ముద్రించ‌డానికి  క‌నీస రిజ‌ర్వ్ సిస్టమ్‌ను అనుస‌రిస్తుంది ఆర్ బీ ఐ . 1956 లో దీనికి సంబంధించిన నిబంధ‌న‌ను రూపొందించారు. దీని ఆధారంగా.. క‌రెన్సీ ముద్రించ‌డానికి ఆర్ బీ ఐ వ‌ద్ద ఎల్ల‌ప్పుడూ రూ.200 కోట్లు క‌నీస నిల్వ‌లు ఉండాల్సి ఉంటుంది. ఈ నిల్వ‌లో రూ.115 కోట్ల విలువైన బంగారం నిల్వ‌లు, అలాగే రూ.85 కోట్ల విలువ చేసే విదేశీ ద్ర‌వ్యం ఉండాలి. దీని ద్వారా అత్య‌వ‌స‌ర స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు క‌రెన్సీని ప్రింటింగ్ చేసేందుకు వినియోగిస్తారు.


  అయితే, ప్ర‌స్తుతం మ‌నం వినియోగించే 10, 20, 50, 100, 200, 500, 2000 రూపాయ‌ల నోట్ల‌ను ప్రింట్ చేయ‌డానికి ఆర్ బీ ఐ ఎంత ఖ‌ర్చు చేస్తుందో తెలుసుకుందామా..? క‌రెన్సీ నోట్ల‌కు ఉండే విలువకు ఆ నోట్లను ప్రింట్ చేయడానికి అయ్యే ఖ‌ర్చులో చాలా తేడా ఉంటుంది. ఒక్క వంద‌ రూపాయ‌ల నోటును ముద్రించేందుకు ఆర్ బీ ఐ కి రెండు రూపాయ‌ల వ‌ర‌కు ఖ‌ర్చు అవుతుంది. అలాగే రెండు వంద‌ల‌ నోటు ముద్రించేందుకు రూ. 2.93 ఖర్చు చేస్తారు.  200 రూపాయల నోటు పొడవు, వెడల్పు మధ్య నిష్పత్తి 66 X 146 mm² . రెండు వంద‌ల‌ రూపాయల నోటుపై సాంచి స్థూపం చిత్రం క‌నిపిస్తుంది.  అదే విధంగా ఐదు వంద‌ల‌ రూపాయల నోటు ముద్రణకు  ఆర్ బీ ఐకి రూ. 2.94 ఖర్చు చేస్తుంది. ఈ నోటుపై మ‌న‌కు ఎర్రకోట చిత్రం క‌నిపిస్తుంది.


    భార‌త్‌లో అత్యధిక విలువ కలిగిన కరెన్సీ నోటు 2000 రూపాయ‌ల నోటు. ప్రస్తుతం దీని ముద్రణను ఆర్ బీ ఐ నిలిపివేసింది. పాత నోట్ల రద్దు అనంత‌రం 2000 రూపాయల నోటును మొద‌టి సారిగా ఆర్బీఐ ముద్రించిన విష‌యం తెలిసిందే.  ఈ రెండు వేల‌ రూపాయల నోటు వెడల్పు, పొడవు నిష్పత్తి 66 X 166 mm² గా ఉంటుంది. ఈ నోటుపై ‘మంగళయాన్’ చిత్రం కనిపిస్తుంది.  ఐదు వంద‌ల నోటును ముద్రించడం కోసం ఆర్బీఐ కి రూ. 3.54 ఖర్చు అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: