వాయుపుత్రునకు పూనూనెతో దీపం వెలిగిస్తే సకల కోరికలూ తీరుతాయి. ధనం కొరకూ, అపార సంపదల కొరకూ నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించి  స్వామిని సేవించాలి. భర్త వశము కొరకూ, బహు ప్రేమను పొందుటకు అవిశనూనెతో దీపాన్ని పెట్టి ధ్యానించాలి. వ్యాధినివారణకు ఆవనూనె దీపాన్ని పెట్టి స్వామిని సేవించాలి. ఇంతటి దీపవిధిని మునీశ్వరుడైన ననత్కుమార మహర్షి తెలియచేశారు. హనుమత్కవచాన్ని చదివినా, విన్నా సకల ఉపద్రవములు పోతాయని స్వయంగా శ్రీరామచంద్రుడు సనత్కుమార మునికి చెప్పాడు. భూత, ప్రేత భయములతో పాటు దు:ఖములు పోవుటకు హనుమత్కవచాన్ని విన్నా చాలు సకల కార్యాలు శుభమవుతాయి. భయమూ పీడాతొలగిపోతాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: