తుంగతుర్తిలో  సీతారాముడి ఆలయంలో  దొంగలు భారీచోరీకి పాల్పడ్డారు. పంచలోహ విగ్రహలతో పాటు వెండి, బంగారు ఆభరణాల అపహరణ.రూ.15లక్షల విలువైన మొత్తం సొత్తు అపహరణ.అర్ధరాత్రి ఆలయంలోకి ప్రవేశించి సీతా రాముల విగ్రహాలను వదిలేసి,కేవలం లక్ష్మణుడి పంచలోహ విగ్రహం మరియు  బంగారు,వెండి ఆభరణాలను అపహరించుకుపోయారు. 


ఈ ఘటన తుంగతుర్తిలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. స్థానికులు మరియు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం,కేంద్రంలోని ప్రసిద్ధిగాంచిన శ్రీ సీతారామచంద్రస్వామి  వారి ఆలయం పోలీస్‌స్టేషన్‌కు అతి సమీపంలోనే ఉంటుంది. అయినా దుండగులు చాకచక్యంగా అర్ధరాత్రి ఆలయంలోకి చొరబడి,దేవాలయ ప్రధాన ద్వారం వద్ద గర్భగుడి తలుపులను  పగులగొట్టి ,అతి పురాతన కాలం నాటి 25 కేజీల బరువుగల లక్ష్మణుడి పంచలోహ విగ్రహం,రెండు వెండి ధనుర్బానాలు, రెండు వెండి హస్తాలు, మూడు వెండి కిరీటాలు,వెండిపళ్లెం,మరియు సీతా దేవి మెడలో ఉన్న  2.5గ్రాముల బంగారపు పుస్తె అపహరించుకెళ్లారు. ఈ ఆభరణాల విలువ సుమారు రూ.15లక్షలకు పైగానే ఉంటుందని స్థానికులు చెప్తున్నారు. 


మంగళవారం ఉదయం పూజారి  రామాచార్యులు రోజువారీలానే దేవాలయంలోకి దూప, దీప,నైవేద్యాలు చేయటానికి రాగా,అప్పటికే ఆలయ తలుపులు పగలగొట్టి ఉండటంతో పోలీసులకు, సర్పంచ్‌కు సమాచారం ఇవ్వడంతో చోరీ విషయం వెలుగులోకి వచ్చింది.  ఆలయ పూజారి ఇచ్చిన  సమాచారం మేరకు ఎస్‌ఐ శ్రీకాంత్‌గౌడ్‌ సిబ్బందితో కలిసి ఘటన స్థలాన్ని పూర్తిగా పరిశీలించారు.స్థానిక పోలీస్ స్టేషన్  మెయిన్‌రోడ్డుపై ఉన్న సీసీ కెమెరాల పుటేజ్‌లను పరిశీలించి  చూడగా ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి ఆలయ గోడదూకి లోనికి ప్రవేశించినట్లు గుర్తించారు.


అర్ధరాత్రి చికటీ సమయం కావడంతో సీసీ కెమెరా పుటేజీల్లో దొంగల ముఖాలు స్పష్టంగా  గుర్తించలేకపోయారు. దేవాదాయశాఖ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ  శ్రీకాంత్‌గౌడ్‌ తెలిపారు.పంచలోహ విగ్రహాలకు అంతర్జాతీయ మార్కెట్‌లో  చాలా పెద్ద డిమాండ్‌ ఉంది అని,కానీ దుండగులు ఒక్క విగ్రహాన్నే ఎందుకు అపహరించినట్టు? అయితే  ఇద్దరు వ్యక్తులే  వచ్చారని, ఓ విగ్రహంతో పాటు మొసుకెళ్లకలిగే బంగారు,వెండి ఆభరణాలనే  తమ వెంట తీసుకుని వెళ్లారని చెప్పుకుంటున్నారు అక్కడ స్థానిక ప్రజలు.


మరింత సమాచారం తెలుసుకోండి: