రేపు మహా శివరాత్రి.. ఎంతోమంది భక్తులు ఎంతో నిష్ఠగా భక్తి శ్రద్దలతో ఉపవాసం చేసి రాత్రి అంత జాగారం చేస్తారు భక్తులు. అలాంటి ఈ శివరాత్రి పండుగ రోజు ఏలాంటి జాగ్రత్తలు చెయ్యాలి ? ఏలాంటి పనులు చేస్తే శివుడు మనపై వరాల వర్షం కురిపిస్తాడు అనేది ఇది వరుకు రాసిన వాటిలోనే చదివాం. అయితే మహాశివరాత్రి రోజు కొన్ని పనులు చేస్తే శివుడికి కోపం వస్తుంది. 

 

శివరాత్రి రోజు ఎట్టిపరిస్థితుల్లో మద్యం.. మాంసం అసలు తీసుకోకూడదు. 

 

ఉదయం ఎలాంటి పరిస్థితి అయినా లేవగానే కచ్చితంగా తలస్నానం చెయ్యాలి. 

 

ఉదయం లేచి స్నానం చేసి 8 లోపు ఖచ్చితంగా శివాలయాన్ని దర్శించాలి. 

 

చెంబుడు నీళ్లని అయినా స్వామికి అభిషేకం చేస్తే మంచిది. గేదెపాలు కాకుండా ఆవు పాలు మాత్రమే అభిషేకం చేయాలి.

 

గర్భగుడికి వెళ్లే సమయంలో పురుషులు చొక్కా ధరించకుండా కండువా కప్పుకొని అభిషేకం చెయ్యడం మంచిది. 

 

మహిళలు అభిషేకం చేస్తున్న సమయంలో శివలింగం తాకడం మంచిది కాదు. 

 

అభిషేకం చేసే సమయంలో చెమటలు కాని వెంట్రుక కాని శివుడిపై పడకుండా చూసుకోవాలి. 

 

శివుడికి దేవాలయానికి మొగలిపువ్వుని తీసుకెళ్ళకుండా చూసుకోవాలి. 

 

చూశారుగా.. ఈ పనులు చెయ్యకుండా జాగ్రత్తలు తీసుకోండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: