కలియుగ దేవుడిగా కొలిచే సాయిబాబా గురించి భారత దేశంలోనే కాదు.. ప్రపంచ స్థాయిలో ఆయనను కొలిచే భక్తులు ఉన్నారు.  సామాన్య మానవుడి లా జీవించి మనలోని పాపాలను ప్రక్షాళన చేసిన మహనీయుడు.. మహానుభావులు సాయినాథుడు.  కులం, మతం, ప్రాంతం అన్న భేదాలు మరచి అంతా ఒక్కటే.. అల్లా మాలిక్ అంటూ ప్రబోధలు చేశారు.  ఆయన బోధనలు ఇప్పటికీ.. ఎప్పటికీ మరువలేనివి. షిరిడీ క్షేత్రంలో అడుగుపెట్టినవారికి కష్టాలు తీరినట్లేనని, నా భక్తుల ఇంట "లేమి" అనేది ఉండదని" సాయిబాబా పేర్కొన్నారు.

 

ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి ఒక ఫకీర్ సంరక్షణలో పెరిగినట్లు చెప్పుకుంటున్న షిరిడి సాయిబాబా ప్రపంచ జనులను తన బోధనల ద్వారా మేల్కొలిపారు. మసీదు మెట్లెక్కగానే దీనులలో సంతోషం వెల్లివిరుస్తుందన్నారు. సాయిబాబా మనలో ఉన్న ఈర్ష్య, అసూయ, కామం, మోహం లాంటి దుర్గుణాలను పోగొట్టుకోమని పదేపదే చెప్పేవాడు. స్వార్థం తగ్గించుకుని ఆధ్యాత్మిక చింతన పెంచుకోమని హితబోధ చేశాడు. ప్రేమ భావాన్ని పెంచుకోమని ప్రబోధించాడు.

 

తోటివారితో ప్రేమగా మసలుకోమని, జంతుజాలాన్ని కూడా ఆదరించమని చెప్పేవాడు. సాయిబాబా తన వద్దకు వచ్చే భక్తులనే కాదు, చీమ, దోమ, కుక్క, పులి అన్ని జీవరాశులనూ సమానంగా భావించేవాడు. జీవరాశులు అన్నీ సమానమే అని చెప్పడానికి, ప్రతిదానిలో తాను ఉన్నానని చాటి చెప్పడానికి భక్తులకు ఎన్నో నిదర్శనాలు చూపించేవాడు. సాయిబాబా ప్రతి మాట, ప్రతి చేష్ట మనిషిని, మహా మనిషిగా తీర్చి దిద్దేందుకు ఉపయోగపడేది. 

మరింత సమాచారం తెలుసుకోండి: