ప్రపంచ‌వ్యాప్తంగా అత్యంత ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రాలలో శబరిమల లో ఉన్న అయ్యప్ప గుడి ఒక‌టి. ప్రతి సంవత్సరం, స్వామి వారి ఆశీస్సులు పొందడానికి భక్త జన సమూహం ఇక్కడికి తరలి వస్తారు. ఇక అయ్యప్ప పూజా సాంప్రదాయం అధికంగా దక్షిణ భారతదేశంలో ఉంటుంది. అయితే అయ్య‌ప్ప జ‌న‌మ‌ర‌హ‌స్యం వెన‌క అస‌లు క‌థ ఏంటి..? శ‌బ‌రిమ‌ల‌లో ఆల‌య్యం ఎందుకు నిర్మించారు..? అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం. మహిశాసురుని సంహరించినందుకు దేవతలపై పగ సాధించాలని అతని సోదరి అయిన మహిషి అనే రాక్షసి బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేసింది. బ్రహ్మ ప్రత్యక్షమయిన తరువాత మహిషి బ్రహ్మను వ‌రం కోరింది. 

 

శివుడికి, కేశవుడికి పుట్టిన సంతానం తప్ప నన్నెవరూ జయించకూడదు. స్ప‌ష్టంగా చెప్పాలంటే ఆమెను ఎవరూ ఆపలేరు, నాశనం చేయలేరు. అయితే  ప్రపంచాన్ని ఆమె నుంచి రక్షించటానికి, విష్ణుమూర్తి మోహినిగా అవతారం ధరించి పరమశివుడిని పెళ్ళాడాడు. వారి కలయికతోనే అయ్యప్ప స్వామి జన్మించాడు. మహారాజు రాజశేఖరుడు అయ్యప్పను దత్తత చేసుకున్నాక, తన సొంతబిడ్డ రాజరాజన్ పుట్టాడు. ఇక ఇద్దరు అబ్బాయిలు యువరాజుల్లాగానే పెరిగినా.. అయ్యప్ప యుద్ధకళలలో, వివిధ శాస్త్రాలు,పురాణాలలో తన ప్రతిభ కనబర్చాడు.

 

సింహాసనానికి వారసుడిని ప్రకటించే సమయం వచ్చేసరికి, మహారాజు రాజశేఖర అయ్యప్పనే రాజుగా చూడాలనుకున్నాడు కానీ మహారాణి తన సొంత కొడుకే రాజు కావాలని ప‌ట్టుప‌ట్టింది. ఈ క్ర‌మంలోనే మంత్రి మరియు వైద్యుడితో కలిసి మణికంఠను చంపేసే పథకం ప‌న్నుతారు. అనారోగ్యం నాటకంలో భాగంగా, మహారాణి తన వైద్యుడు అసాధ్యమైన చిట్కా చెప్పేట్లా చేసింది. అదే ఆడపులి పాలని తేవడం. ఎవరూ అది చేయలేనప్పుడు, ధైర్యవంతుడైన మణికంఠ తను వెళ్తానని అంటారు.

 

ఇక వెళ్ళేదారిలో, రాక్షసి మహిషిని ఎదుర్కొని, అఝుథ నది తీరంలో సంహరిస్తాడు. అలా ఆయన జీవితలక్ష్యం పూర్తయింది. ఆ త‌ర్వాత పులితో పోరాడి గెలిచి దాని మీదనే ఊరేగుతూ భవంతికి తిరిగొచ్చాడు. ఇంత‌లోనే మహారాజుకి తన కొడుకుపై మహారాణి చేసిన కుట్ర తెలిసిపోతుంది. దీంతో మణికంఠను క్షమించమని అర్థిస్తాడు. మణికంఠ మహారాజుకి తన జీవితలక్ష్యం పూర్తయినందున, స్వర్గానికి తిరిగి వెళ్ళాల్సివుంటుందని తెలిపాడు. మహారాజును శబరి కొండపై తన చిన్న జీవితానికి గుర్తుగా ఒక ఆలయం నిర్మించమని కోరతాడు. అలా అయ్య‌ప్ప కోరిక మేర‌కు శబరిమలలో ఆల‌యం నిర్మిస్తారు.


 
  
 
 

 

 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: