ఈ రెండు రోజులు శివ భక్తులకు ఎంతో పవిత్రమైనవి. త్రయోదశి తిథిలో పరమేశ్వరుని భక్తులు ఒక రోజంతా ఉపవాసం ఉండి, సాయంత్రం పూజలు చేస్తారు. దీనిని ప్రదోష్ వ్రతం అంటారు. ఈ నెలలో అక్టోబర్ 17 నుండి 25 వరకు అత్యంత పవిత్రమైన రోజులు. ఎంతో విశిష్టత కలిగిన ఈ రోజుల్లో దేవీ నవరాత్రుల ఉత్సవాలను జరుపుకుంటారు. అలాగే అక్టోబర్ 22 నుండి అక్టోబర్ 26వ తేదీన దుర్గామాత పూజలను చేసుకుంటారు. ఈ నవరాత్రులు దుర్గామాతకు అంకితమివ్వబడింది. ఈ నవరాత్రి సమయంలో, ఉత్తర భారతదేశంలో భక్తులు తొమ్మిది రోజులు ఉపవాసం ఉంటారు. అయితే దక్షిణాన అమ్మవారి విగ్రహాలు మరియు బొమ్మలను ఏర్పాటు చేసి ఆ దేవిని ఆరాధిస్తారు. తూర్పు, పశ్చిమ భారతదేశంలోని భక్తులు కూడా ఈ ఉత్సవాలను ఎంతో భక్తితో, ఉత్సాహంతో జరుపుకుంటారు.
మహిషాసురుడు అనే రాక్షసుడిని దుర్గామాత సంహరించిందని.. ఆ పవిత్రమైన రోజునే విజయ దశమిగా జరుపుకుంటారు. అందుకే ఈరోజు ఎంతో పవిత్రమైన రోజుగా భావిస్తారు. అలాగే చెడుపై మంచి విజయం సాధించిందని చాలా మంది నమ్ముతారు. మన దేశంలోనే అత్యంత ఘనంగా జరిగే దసరా ఉత్సవాలు జరిగే తొలి ప్రాంతం మైసూరు ప్రాంతం. ఈ వేడుకలను తిలకించడానికి ప్రతి ఏడాది వేలాది మంది సందర్శకులు తరలివస్తారు. పురాతన సంప్రదాయం ప్రకారం ఈ ఉత్సవాలను నవరాత్రి మొదటి రోజున ప్రారంభమై విజయ దశమి రోజు వరకు కొనసాగుతాయి. ఈ తొమ్మిది రోజుల పాటు చాముండేశ్వరి దేవతా విగ్రహాన్ని బంగారు మంటపంలో కూర్చొబెట్టి ఊరేగింపు ఉత్సవాలు నిర్వహిస్తారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి