అట్ల తద్ది అంటే ఇప్పుడు చాలా మందికి తెలియక పోవచ్చు.. కానీ ఇప్పుడు మాత్రం అందరూ జరుపుకుంటారు.. ముఖ్యంగా ఈ పండుగను చాలా పవిత్రంగా ఉంటారు..గౌరీ పూజను చేస్తారు..ఈరోజు చాలా ప్రత్యేకమైనది గా పురాణాలు చెప్తాయి.. ముత్తైదువులు , పెళ్లికాని యువతులు ఎంతో నిష్టగా ఈ పండుగను జరుపుకుంటారు. ఈ పండుగను ప్రతి ఏడాది ఆశ్వయుజ మాసం బహుళ తదియ రోజున అట్ల తద్ది అని పిలుస్తారు. ముఖ్యంగా ఈ రోజు ఆడపడుచులు అందరు చేరి చెట్లకు ఊయల కట్టి ఊగుతారు.



ఆడవాల్లను పిలిచి పూజలు జరిపించి వాయినాలు ఇస్తారు.. ఈరోజు అంటే నవంబర్ మూడు న అట్ల తద్ది సంబరాలు మొదలయ్యాయి.. ఈరోజు యెక్క ప్రత్యేకతలు ఎంటి? ఎలాంటి ప్రత్యేకతలు ఉన్నాయి? ఎలా పూజలు చేస్తారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. స్నానమాచరించాలి. ఉపవాసం ఉండి ఇంట్లో తూర్పు దిక్కున మండాపాన్ని ఏర్పాటు చేసి గౌరీదేవిని పూజించాలి. ధూప, దీప, నైవేద్యాలు సమర్పించి, వినాయక పూజ తర్వాత గౌరీ స్తోత్రం, శ్లోకాలు పఠించాలి. సాయంత్రం చంద్రదర్శనం అనంతరం తిరిగి గౌరీపూజచేసి 10 అట్లు నైవేద్యంగాపెట్టాలి. అనంతరం ముత్తైదువులకు అలంకరించి పది అట్లు, పది పండ్లు వాయినంగా సమర్పిస్తారు.




ఈరోజు అట్లతద్ది పండుగ రోజు నోము కథలు చెప్పుకొని మరోసారి ప్రత్యేకతలు చెప్పుకొని అమ్మవారిని ప్రసన్నం చేసుకుంటారు.అక్షతలు వేసుకోవాలి. ముత్తైదువులకు నల్లపూసలు, లక్కకోళ్లు, రవిక గుడ్డలు, దక్షిణ తాంబూలాలు, అన్న ప్రసాదాలు అందజేశారు.ఈ పండుగనాడు పది రకాల పండ్లను తినడం , రోజులో పది సార్లు తాంబూలం వేసుకోవడం ,ఊయ్యల పండగ అని, గోరింటాకు పండగ అని కూడా అంటారు. ఈ పండుగ వల్ల గౌరీదేవి అనుగ్రహం లభించి అవివాహిత యువతులకు గుణవంతుడు, అందగాడైన వ్యక్తిని భర్తగా లభిస్తాడని, పెళ్లైన వారికి సంతానం కలుగుతుందని, పుణ్యం లభిస్తుందని నమ్ముతారు... అందుకే ఈ పండుగను కొన్ని ప్రాంతాల్లో ఘనంగా జరుపుకుంటారు.. అదండీ అట్లతద్ది పండుగ ప్రత్యేకత... ఈరోజు అట్లతద్ది జరుపుకుంటున్న వారందరికీ మా హెరాల్డ్ ఛానెల్ తరపు నుంచి ప్రత్యేక  శుభాకాంక్షలు..

మరింత సమాచారం తెలుసుకోండి: