మనలో గుడికి వెళ్ళే అలవాటు కొందరికి మాత్రమే ఉంటుంది. ఆడ-మగ, పెద్ద-చిన్న అనే తేడా లేకుండా చాలా మంది గుళ్ళు గోపురాలను దర్శించుకుంటారు. అసలు గుడికి ఎందుకు వెళ్ళాలి అని ఎప్పుడైనా ప్రశ్నించుకున్నారా? కాసేపు కాలక్షేపం కోసం లేదా ఏమైనా దిగులు,ఇబ్బందులు ఉంటే వాటిని మర్చిపోవడం కోసం అనుకుంటే పొరపాటు. గుడికి వెళ్ళడం మొక్కుబడి వ్యవహారం కాదు. ఆలయాలను దర్శించుకోవడం వెనుక శాస్త్రీయ ప్రయోజనాలు ఉన్నాయి. దేవాలయాలకు ఎందుకు వెళ్ళాలి అనే విషయాని కింద ఇచ్చిన ఏపీ హెరాల్డ్ ఆర్టికల్ ద్వారా తెలుసుకోండి.

అందుకే అలాంటి గుళ్ళలో అడుగు పెట్టగానే తనువు, మనసు ప్రశాంతతను పొందుతాయి. రోజూ గుడికి వెళ్ళి మూల విరాట్టు ఉన్న గర్భగుడి చుట్టూ ప్రదక్షిణ చేసే అలవాటు ఉన్నవారికి ఆ తరంగాలు సోకి అవి శరీరంలోకి ప్రవహిస్తాయి,దాని వలన శరీరంలోనికి పాజిటివ్ తరంగాలు ప్రవేశించి ఆరోగ్యంగా ఉంచుతాయి.అడప దడప ఎప్పుడో ఒకసారి ఆలయానికి వెళ్ళే వారిలో ఆలయ యంత్ర ప్రభావిత శక్తి కొంత సోకిన గమనించదగ్గ తేడా మనకు తెలియదు. కాని నిత్యం గుడికి వెళ్ళేవారిలో పాజిటివ్ ఎనర్జీ చేరడం స్పష్టంగా తెలుస్తుంది. ఇకపోతే గర్భగుడి మూడు వైపులా పూర్తిగా మూసి ఉండి, ఒక్కవైపు మాత్రమే తెరిచి ఉంటుంది. అందువల్ల గర్భాలయంలో, ముఖద్వారం దగ్గర పాజిటివ్ ఎనర్జీ కేంద్రీకృతమై మరీ అధికంగా ఉంటుంది.

గర్భగుడిలో వెలిగించే దీపం ఉత్పత్తి చేసే శక్తి కూడా చెప్పుకోదగ్గదే. ఆలయాల్లో గంటలు మోగిస్తారు. వేద మంత్రాలు పఠిస్తారు. భక్తి గీతాలు ఆలపిస్తారు. ఈ మధుర ధ్వనులు శక్తిని సమకూరుస్తాయి మనస్సును చైతన్య పరుస్తాయి.. గుడిలో దేవుడికి సమర్పించే పుష్పాలు, కర్పూర హారతి, అగరొత్తులు, గంధం, పసుపు, కుంకుమల నుండి వచ్చే పరిమళాలు శరీరంతో రసాయణ చర్య జరిగి శక్తి వంతం అవుతుంది. గుడిలో ప్రసాదాలు పులిహోర,దధ్యోజనం,చక్కర పొంగళి,వడలు, కొబ్బరికాయ , అరటిపళ్ళు నైవేద్యం పెడతారు. ఈ ప్రసాదాలు దేవుల్లకు నీవేదన సమర్పించిన తర్వత భక్తులకు ప్రసాదంగా ఇస్తారు.వీటిని సేవించడం వల్ల శరీరానికి అవసరమైన అనేక ఔషధాలు అందుతాయి. లోహానికి శక్తి తరంగాలను తొందరగా గ్రహించే శక్తి ఉంటుంది. ఆవిధంగా ప్రయోజనం కలుగుతుంది. భక్తులు గుడికి వెళ్ళి దేవుని దర్శించుకుంటున్న సమయంలో గర్భగుడిలో దీపం వెలుగుతుంటుంది. ఎవరైనా గుడికి వెళ్లడం అలవాటు లేకుంటే, ఈరోజు నుండే వెళ్లడం అలవాటు చేసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: