మానవునిగా పుట్టాక ఎన్నో కోరికలు మరెన్నో ఆశలు ఉండడం సహజం. అయితే మన జీవితం మనకు తెలియకుండానే అదుపు తప్పిపోతుంది. పెద్ద వారయ్యాక చదువు వలన కావొచ్చు, మనము చేసే వృత్తి వలన కావొచ్చు మన ఆలోచనలు పూర్తిగా మారిపోతాయి. అయితే యవ్వనంలో ఉన్నప్పుడు లేదా పెళ్లి వయసు వచ్చినప్పుడు మెగా మరియు ఆడవారికి చాలా కోరికలు ఉంటాయి. ఆడవారయితే మాకు మంచి భర్త రావాలి...నన్ను బాగా చూసుకోవాలి అని, అలాగే మగవారు నాకు చాలా అందమైన భార్య రావాలి. ఇలా ఊహించుకుంటూ ఉంటారు. అయితే పెళ్లి అనే బంధంలో మీరు అనుకున్న విధంగా జరగాలంటే కొన్ని పనులను చేయక తప్పదని శాస్త్రాలు చెబుతున్నాయి.

మీరు ముందుగా నాగదేవతలకు శుక్ల చవితి, శుక్ల పంచమి తిథులు, శుక్రవారం, ఆదివారం రోజులలో ఆరాధించాలి. ఇలాంటి పవిత్రమైన రోజులలో పూజలు చేస్తే మీకు ఎటువంటి దుష్ఫలితాలు ఉన్నా, వాటి నుండి బయటపడే అవకాశం ఉంటుంది. అదే విధంగా పౌర్ణమి, దశమి, ఏకాదశి, ద్వాదశి తిథులు, క్రిష్ణ పక్షాలు నాగదేవతల పూజలకు మంచివి కాదు. కాబట్టి అటువంటి సమయాల్లో పూజలు చేయకండి. నాగదోష ప్రభావాన్ని బట్టి మాత్రమే పరిహారాలు పాటించాల్సి ఉంటుంది. నాగదోషం తీవ్రంగా ఉంటే, మీకు దగ్గర్లోని దుర్గా మాత ఆలయంలో నిద్ర చేసి మరుసటి రోజున శివుని దర్శనం చేసుకుని, రాహు,కేతువుల పూజలు, దానధర్మాలు చేస్తే ఫలితం ఉంటుంది.

మరి కొంతమంది జీవితాలు అయితే పెళ్లి చేసుకున్న కొద్ది రోజులకే విడాకులు తీసుకోవడం జరుగుతుంటుంది. వివాహం అయిన మొదటి కొన్ని రోజులలో, విడాకులు తీసుకున్న జంట కన్నీళ్లు పెట్టుకోకుండా స్వయంవర పార్వతీ మంత్రాన్ని ప్రతిరోజూ పఠించవచ్చు. ఇది భార్యాభర్తల మధ్య మానసిక ఐక్యతను పెంచుతుంది. కాబట్టి మీరు  ఆచారాలను పాటించడం వలన మీ వివాహ జీవితం ఎంతో సాఫీగాా ఆనందంగా తాగడానికి దోహదపడుతుంది. మనం ఏ పని చేసినాా ఎంతో భక్తిి శ్రద్ధలతో నమ్మకంతో చేయాలి అప్పుడే  మంచి ఫలితం దక్కుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: