పారాయణం మొదలు పెట్టే రోజు శుచిగా తలస్నానం చేయాలి.
పారాయణం చేసేటప్పుడు ఎవరితోనూ మాట్లాడకూడదు పారాయణానికి ఆటంకం కల్పించే వస్తువులు ఏవి దగ్గర ఉంచుకోకూడదు.(సెల్ ఫోన్, రేడియో) ఇలాంటివి దగ్గర ఉంచుకోకూడదు.
సాయి సచ్చరిత్రను ఎవరైనా పారాయణం చేయవచ్చు. కులమతాలు లేవు, వయో భేదం కూడా లేదు,లింగ బేధము లేదు.ఎలాంటి వారైనా సాయి సచ్చరిత్రను పారాయణం చేయవచ్చు.
ఎక్కువ కష్టాలు, సమస్యలతో బాధపడుతున్న వాళ్లు సాయి సచ్చరిత్ర ను ఏడు రోజులు పారాయణం చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
పారాయణం ను ఉదయమే మొదలు పెట్టాలి.ప్రత్యేక సంకల్పముతో పారాయణము చేయాలనుకుంటే, ఆ వ్యక్తి పేరు పై లేదంటే సమస్యను ఉద్దేశించి ఒక్క రోజులు పారాయణ పూర్తి చేయాలి.
బాబాకు ఇష్టమైన రోజుల్లో పారాయణం చేయడం చాలా మంచిది. బాబాకి ఇష్టమైన రోజులు గురుపౌర్ణమి,విజయదశమి, శ్రీరామనవమి,దత్త జయంతి ఈ రోజుల్లో పారాయణం చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
పారాయణం మొదలు పెట్టేముందు పాపకు నైవేద్యం సమర్పించాలి.అంతేకాకుండా మనలో ఉండే అహంకారం, అసూయాద్వేషాలు పక్కన పెట్టాలి.
బాబా రూపాన్ని గుండెల్లో ప్రతిష్టించుకొని సచ్చరిత్ర పారాయణం చేస్తే మనం కోరిన కోరికలు నెరవేరు తాయి.
పారాయణము చదివేది అయిపోయిన తర్వాత సచ్చరిత్రను దానం చేయాలి.వారి చేత కూడా పారాయణం చేయించడం వల్ల మంచి జరుగుతుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి