సూర్య దేవుడు మరియు ఛాయాదేవిల పుత్రుడు శనీశ్వరుడు అని అందరికీ తెలిసిందే. అదే విధంగా గ్రహాలలో ఒకరు శని. మానవులు చేసే కర్మలు ఆధారంగా శనీశ్వరుని ప్రభావం వారిపై ఉంటుంది. అయితే మనం తెలియకుండా చేసే కొన్ని తప్పుల వలన కూడా శని యొక్క చెడు ప్రభావం మనపై పడే అవకాశం ఉందని అంటున్నారు వేద పండితులు. ముఖ్యంగా శనీశ్వరునికి ఎంతో ప్రీతికరమైన శనివారం రోజున ఆయన ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. కాగా శనివారం రోజున కొన్ని వస్తువులను ఇంటికి తీసుకురావడం వలన ఆ కుటుంబానికి శని చుట్టుకుంటుందని అంటున్నారు పెద్దలు. ఇంతకీ ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

శనివారం రోజు ఇనుమును అసలు కొనకూడదు, కొని ఇంటికి తీసుకు రాకూడదు ఇలా చేయడం వలన ఆర్థికంగా చాలా నష్టాలు ఎదుర్కోవాల్సి  వస్తుందని పురాణాల్లో చెప్పబడింది. శనివారం నాడు ఆవాలను ఇంటికి తెచ్చినట్లయితే, ఎన్ని ఆవాలు అయితే అందులో ఉంటాయో అన్ని సమస్యలు మన ఇంటికి స్వయంగా తెచ్చుకున్నట్టే. ఇక అవన్నీ ఒక్కొక్కటిగా మన జీవితంలో ఎదురయ్యి ఇబ్బంది పెట్టడం మొదలుపెడతాయి. అలాగే శనివారం ఉప్పుని కొనకూడదు, అలాగే ఎవరి దగ్గర నుండి తీసుకోకూడదు ఇలా చేయడం వలన ఆ వ్యక్తికి కష్టాలు మొదలవుతాయి. అలాగే శనివారం రోజున నల్ల మిరియాలను ఇంటికి తీసుకొచ్చినట్లయితే మన చుట్టూ పరిసరాల్లో ఉంటే నెగిటివ్ ఎనర్జీ మన వెంట ఇంటికి తెచ్చినట్లే అందుకే బిర్యాని కూడా ఈ రోజున కొనకూడదు.

అలాగే నల్లనువ్వులను కూడా కొనరాదు ఇవి కొని ఇంటికి తీసుకు రావడం వల్ల  కష్టాలు కూడా మన వెంట వస్తాయి, ఏ కార్యము సజావుగా సాగదు. ఇక శనివారం నాడు వంకాయలు కొనరాదు. అదే విధంగా శనివారం రోజున నల్ల దుస్తులు కానీ  కొన్నట్లు అయితే దరిద్రాన్ని మనమే దగ్గరుండి వెంటపెట్టుకుని ఇంటికి తీసుకు వచ్చినట్లు అవుతుంది. అందుకే నల్ల వస్తువులను శనివారం రోజున కొనరాదు. ఇలా శనివారం రోజున ఈ నియమాలు కనుక పాటించకపోతే కష్టాలు తప్పవు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: