ఇది వారి పండుగ సంప్రదాయంలో ఒకటి. ఇలా చేయడం వలన ఎంతో పుణ్యం లభిస్తుందని వారి యొక్క విశ్వాసం. ఈ ఏడాది 2021 సంవత్సరంములో జులై 20 మరియు 21వ తేదీన వచ్చినది. బక్రీద్ పండుగ రోజున చాలా మంది ముస్లిములు మరణించిన వారి పెద్దల సమాదుల వద్దకు వెళ్ళి ప్రత్యేక ప్రార్దనలు జరుపుతారు. అలా చేయడం వలన వారి ఆత్మకు శాంతి కలుగుతుందని వారి నమ్మకం. ముఖ్యంగా వారి సమాధుల దగ్గర వారికీ ఎంతో ఇష్టమైన బట్టలు మరియు ఆహార పదార్దాలను ఉంచి ప్రార్ధనలు చేయడం వారి ఆచారం. ఈ విధంగా చేయడం మూలాన చనిపోయిన వారి పెద్దలకు ఇవి అందుతాయని వారి నమ్మకం.
అయితే ప్రతి ఒక్క మతంలో ఎవరికి వారి సంప్రదాయాలు ఉంటాయి. మత గురువుల ఆదేశాల ప్రకారం వారు వివిధ రకాల పద్దతులను ఆచరిస్తూ ఉంటారు. ఈ పవిత్రమైన రోజున సత్యం కోసమే ప్రతి ఒక్కటీ త్యాగం చేయడానికి సిద్ధపడతారు. ఇందులో వార్తికి ప్రవక్త హజరత్ ఇబ్రహీం స్ఫూర్తి అని చెప్పవచ్చు. ఇలా ఎన్నో విషయాలు బక్రీద్ గురించి ఉన్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి