ఈ ప్రపంచానికే వెలుగును పంచేవారు సూర్య భగవానుడు. ఆయన లేనిదే ఈ ప్రపంచం ముందుకు సాగదు. ఆది దేవుడిగా పిలవబడుతున్న ఆ సూర్యభగవానుడు అత్యంత తేజోమయుడన్న విషయం తెలిసిందే. ఆయన కిరణాల వలనే, ఆయన వెలుగు వలనే ఈ భూమి పై జీవకోటి ఆధారపడి ఉంది. పురాణాల ప్రకారం సూర్య దేవుని సతీమణి పేరు సంద్యా దేవి ఈమెకు యముడు, యమి అని ఇరువురు కవలలు  జన్మిస్తారు. సూర్యుడు ఆమె చెంతకు వచ్చిన సమయంలో ఆ వేడిని తట్టుకోలేక పోతుంటారు సంద్యా దేవి. అందుకే ఆమె సూర్యుని వేడిని కూడా భరించే విధంగా వరం పొందేందుకు కఠోర తపస్సు చేయాలని నిర్ణయించుకుంటుంది. అందుకోసం ఆమెకు బదులుగా ఆమె యొక్క ఛాయను వదిలి వెళుతుంది. 

ఛాయా దేవి ఎవరికీ అనుమానం రాకుండా సంధ్యా దేవిలాగే ప్రవర్తించాలని ఆజ్ఞాపించి వెళుతుంది. అలా ఆమె వెళ్ళాక ఛాయా దేవికి మరియు సూర్య దేవునికి శని జన్మిస్తారు. అలా ఛాయా దేవికి మరియు సూర్యునికి జన్మించిన వారే శని. అయితే శని తన మాత అయినటువంటి ఛాయా దేవి రంగుని సంతరించుకుని జన్మిస్తాడు. అయితే శనిని చూసిన సూర్య భగవానుడు నా వంటి తేజోవంతునికి ఇలాంటి నీలి ఛాయలు అలుముకున్న సుపుత్రుడు పుట్టుట ఏమిటి అని ఆగ్రహించి శనిని తన సుపుత్రునిగా అంగీకరించకుండా తనని అడవులలో విడిచిపెట్టండి అని ఆజ్ఞాపిస్తాడు. అలా శని తన కుటుంబానికి దూరంగా జీవించాల్సి వస్తుందని పురాణం చెబుతోంది.

అలా అందరి ప్రేమకు , అభిమానానికి దూరంగా పెరిగిన శనీశ్వరుని దగ్గరకు అతని తల్లి ఛాయా దేవి అప్పుడప్పుడు వెళ్ళడానికి సూర్యుని వద్ద అనుమతిని పొంది కుమారుని బాగోగులు చూసుకునే వారు. సంద్యా దేవి తన తపస్సు పూర్తి చేసుకుని వచ్చిన తర్వాత ఛాయా దేవిని తనలో మళ్లీ కలిపేసుకుంటుంది అలా ఛాయా దేవి అంతం అయిపోతుంది. తనకున్న ఏకైక బాంధవ్యం తన తల్లి కూడా దూరం అవడంతో శని దేవుడు ఎంతో కటినంగా మారిపోయారని పురాణాలు వివరణ ఇస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: